ప్రభాస్ సలార్.. టైటిల్ మీనింగ్ ఇదేనా.. రెబల్ ఫ్యాన్స్ రచ్చ రంబోలానే..!

Prabhas Salaar Title Meaning

కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ 1, 2 సక్సెస్ ల తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాను కూడా రెండు మూడు పార్ట్ లుగా తీయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ క్రమంలో సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా నుంచి వచ్చిన టీజర్ అంచనాలు పెంచేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని మాస్ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సలార్ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి ఫ్యాన్స్ లో ఒక కన్ ఫ్యూజన్ రన్ అవుతూనే ఉంది. అయితే దాని కోసం గూగుల్ ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ డౌట్ ఏంటి అంటే.. అసలు సలార్ అంటే అర్ధం ఏంటి అని.. ప్రభాస్ సలార్ అనౌన్స్ చేయగానే వెంటనే సోషల్ మీడియాలోకి సలార్ ట్రెండింగ్ వచ్చేసింది. అర్ధం తెలిసిన వాళ్లు తెలియని వాళ్లు అందరు ప్రమోట్ చేస్తున్నారు. కానీ సలార్ కి అసలు అర్ధం ఏంటన్నది తెలుసుకోవాలని అనుకోలేదు.

అయితే రీసెంట్ గా గూగుల్ కి సలార్ మీనింగ్ గురించి ఎక్కువ సెర్చ్ ఆప్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. అసలు ఇంతకీ సలార్ టైటిల్ అర్ధం ఏంటి అంటే సలార్ అంటే రక్షకుడు అని అర్ధం.. అంతేకాదు కమాండర్, యోధుడు, నాయకుడు లాంటి అర్ధాలు కూడా వస్తాయట. సో ప్రభాస్ సలార్ అంటూ మరో రచ్చకి సిద్ధం అవుతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమా సలార్ మాత్రమే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు ప్రభాస్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh