అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పాడా.. ఈ ట్విస్ట్ ఊహించలేదే..!

Allu Arjun Not Interested in Aswaddhama Project Adhitya Dhar

పుష్ప 1 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ని అంచనాలకు తగినట్టుగా వచ్చేందుకు కష్టపడుతున్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ మరోసారి కలిసి పాన్ ఇండియా లెవెల్లో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఇదిలాఉంటే పుష్ప తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ కి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తో సినిమా చర్చల్లోకి వచ్చింది.

అశ్వద్ధామ టైటిల్ తో ఒక సినిమా అనుకున్నారు. అసలైతే ఈ సినిమాలో లీడ్ రోల్ గా ఉరి హీరో విక్కీ కౌశల్ నే తీసుకోవాలని అనుకున్నాడు ఆదిత్య ధర్ కానీ అతనికి డేట్స్ క్లాష్ వల్ల అశ్వద్ధామ చేజార్చుకున్నాడు. అయితే అల్లు అర్జున్ ముందు ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినా రీసెంట్ గా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసి అశ్వద్ధామ విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేసే ప్రతి సినిమా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చకా సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకే అశ్వద్ధామ విషయంలో కొద్దిపాటి డౌట్ ఉండగా ఆ సినిమా చేయనని డైరెక్టర్ కి చెప్పేశాడట అల్లు అర్జున్. పుష్ప 2 తర్వాత సందీప్ వంగాతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh