NTR: రాములమ్మతో..రామారావు

NTR: రాములమ్మతో .. రామారావు

లేడీ అమితా బచ్చన్ గా.. లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న విజయశాంతి రాజకీయాల్లో మొదట్లో వెలుగు వెలిగింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రల్లో కనిపించింది, కానీ ఇప్పుడు ఆమె రాజకీయం కష్టాల్లో పడినట్లు అయింది.

అనేక పార్టీలు మారిన విజయశాంతి ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో బిజెపిలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఇప్పుడు మాత్రం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణలో బిజెపి దూసుకు పోతుంది.

ఈ సమయంలో ఆమె పార్టీలో క్రియాశీలకంగా ఉండాల్సింది పోయి కనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అందుకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం వల్లే అనేది ఆమె వాదన. ఏ కార్యక్రమం జరిగిన తనకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు, మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు అంటూ ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

రాష్ట్ర నాయకులు తనను పట్టించుకోవడం లేదని తన యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం లేదు అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెపిలో ఎలాగూ తనను పట్టించుకోవడం లేదు కనుక సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాట్లుగా పుకార్ల షికార్లు చేస్తున్నాయి.

 

 

సుదీర్ఘ కాలం తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో కీలక పాత్రలో విజయశాంతి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ వరుసగా ఆఫర్లు వచ్చినా కూడా అన్నింటిని సున్నితంగా తిరస్కరించింది. కానీ ఎట్టకేలకు ఆమె మళ్ళీ ఒక సినిమాకు కమిట్ అయింది.

ఎన్టీఆర్ అంటే విజయశాంతికి అభిమానం.. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని మిక్కినేని సుధాకర్ నిర్మించబోతున్నారు. #NTR30 అనే వర్కింగ్ టైటిలో తో సెట్స్ పైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన డైలాగ్ మోషన్ పోస్టర్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20ర విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది.

హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర పవర్ ఫుల్ గా వుంటుందని డైలాగ్ మోషన్ పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ తో పాటు ఇందులో మరో పవర్ ఫుల్ పాత్ర కూడా వుందట.ఆ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్..

సీనియర్ హీరోయిన్ రాములమ్మ విజయశాంతి నటించనుందని తెలిసింది. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు ఓ పవర్ ఫుల్ అత్త పాత్ర వుంటుందట. ఆ పాత్ర కోసం విజయశాంతిని ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఈ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ వుంటుందని ఇది సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 14 ఏళ్ల విరామం తరువాత మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రాములమ్మ మరో సారి ఎన్టీఆర్ కోసం కెమెరా ముందుకు రానుందని వార్తలు వినిపిస్తుండటంతో #NTR30 పై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇదిలా వుంటే ఈ మూవీ వచ్చే నెలైనా పట్టాలెక్కుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh