TS PGECET Results 2023 : నేడు టీఎస్ పీజీఈసెట్ 2023 ఫలితాలు

TS PGECET Results 2023

తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్) -2023 ఫలితాలు గురువారం (జూన్ 8న) విడుదల కానున్నాయి. జూన్ 8న మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

TS PGECET Results 2023 విడుదలైన తర్వాత అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 2023-24 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌/ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) నిర్వహించిన విషయం తెలిసిందే. మే 29 నుంచి జూన్‌ 1 వరకు ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించారు.  ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించారు. ఉద‌యం సెష‌న్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు 88.01 శాతం మంది విద్యార్థులు హాజ‌రయ్యారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh