NTR & Chiranjeevi: నేనెవరిని టార్గెట్ చేయట్లేదు.

NTR & Chiranjeevi: నేనెవరిని టార్గెట్ చేయట్లేదు.

ప్రస్తుతం గ్లోబల్ సినిమానే ఒత్తిడికి లోనవుతుంది.. దానికి కారణం ప్రేక్షకులకు కొత్తగా ఏదో కావాలి.. ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటున్నారు. ఇది నమ్ముతూ.. ఆ ఒత్తిడిని తట్టుకుని నా వరకు నేను ఇంకా బాగా నటించేందుకు ప్రయత్నం చేస్తాను.

ఈ ఒత్తిడి మంచిదే. ఇది ఒక ఛాలెంజ్‌గా ఇండస్ట్రీ స్వీకరించాలి. తద్వారా మంచి సినిమాలు వస్తాయి. ఇది అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ విషయంలో నేనెవరినీ తక్కువ చేయదలుచుకోవడం లేదు.

అందరూ ఈ ఛాలెంజ్‌ని స్వీకరిద్దాం. ప్రేక్షకులకు గుడ్, గ్రేట్ సినిమాలను అందించేందుకు ముందుకు వెళదాం’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త’ .

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సౌత్‌లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.

 

 

కానీ, వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మందిరాలకు రక్షణ నిమిత్తం పోలీసులు బిజీగా ఉండడంతో.. ఈ వేడుకకు బందోబస్తు నిర్వహించడం కష్టమని పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో అక్కడ వేడుకను రద్దు చేశారు.

ఆ తర్వాత హైదరాబాద్ పార్క్ హయాత్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో తారక్ (Tarak) పై వ్యాఖ్యలు చేశారు…అయితే ఇటీవల ఓ వేదికపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ.. డైరెక్టర్స్‌కి కొన్ని సలహాలు ఇచ్చారు.

డైరెక్టర్స్ కరెక్ట్‌గా ఉండకపోతే.. ఫ్లాప్సే వస్తాయని చెబుతూ.. అందుకు తన సినిమానే ఉదాహరణగా చూపించుకున్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం రీసెంట్‌గా విడుదలై భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

ఇదే చెబుతూ.. డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని, డేట్స్ క్లాష్ అవుతున్నాయనో.. ఇంకేదో కారణాలతో కంగారుకంగారుగా షూటింగ్స్ చేయవద్దని.. మీపై ఒక ఇండస్ట్రీనే ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలంటూ.. డైరెక్టర్స్‌కి పాఠాలు చెప్పారు.

అలాగే సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే వ్యాఖ్యలను కూడా ఆయన కొట్టేశారు. అయితే చిరు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. కొరటాల శివను ఉద్దేశించే ఆయన ఈ విధంగా మాట్లాడారని, ‘ఆచార్య’ విషయంలో అంతా కొరటాలదే తప్పు అన్నట్లుగా చిరు ప్రస్తావించారనేలా వార్తలు వైరల్ అయ్యాయి.

ఇప్పుడు కొరటాలకు ఎంతో సన్నిహితుడైన ఎన్టీఆర్.. అతనికి భుజం కాస్తూ.. సినిమా ఇండస్ట్రీ ఒత్తిడిలో ఉందని చెప్పడమే కాకుండా.. దీనికి కారణం ఎవరో ఒక్కరినే నిందించాలని అనుకోవడం కరెక్ట్ కాదని..

ఇప్పుడందరూ అప్‌డేట్ కావాలనేలా మాట్లాడి.. చిరుకు ఎన్టీఆర్ పంచ్ ఇచ్చాడనేలా అప్పుడే ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మరో విశేషం ఏమిటంటే.. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలోనే చేయబోతున్నారు. అందుకే కొరటాలకు సపోర్ట్‌గా నిలబడ్డాడని కూడా సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh