మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టానున్న వానలు

TELUGU STATES :మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టానున్న వానలు

తెలంగాణే కాదు ఏపీ లోకూడా ఐతే రేపటి నుంచి మరో మూడు రోజు లపాటు జోరుగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.అసలే మొన్నటి దాకా కురిసిన భారీ వర్షాలతో వడగండ్లు పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

రాయలసీమ నుంచి తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా మీదుగా దక్షిణ ఝార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడబోతున్నాయి. మార్చి 25న ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. 30-40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వడగండ్లు పడే అవకాశముంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కారణంగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు మార్చి 26న ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చు.

ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. మార్చి 27న కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. మార్చి 28 నుంచి మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. మార్చి 27న కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. మార్చి 28 నుంచి మళ్లీ పొడి వాతావరణం ఏర్పడి.. సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.

అటు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఉరుములతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా వరకు  శనివారం ఏర్పడిన ‘ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు వాతావరణం ఇలా ఉండనుందని తెలిపారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh