స్టార్ హీరో అజిత్ కి పితృయోగం

Ajith: స్టార్ హీరో అజిత్ కి పితృయోగం

కోలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరో ఒక‌రైన అజిత్ కుమార్ ఇంట విషాదం నెల‌కొంది. గ‌త కొన్ని రోజుల నుంచి అనారోగ్య కార‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న అజిత్ తండ్రి సుబ్ర‌మ‌ణ్యం శుక్ర‌వావారం చెన్నై లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో అజిత్ ఇంట విషాద చాలు అలుముకుంది. సుబ్ర‌మ‌ణ్యం వ‌య‌సు 84 ఏళ్లు. వీరి స్వ‌స్థ‌లం కేర‌ళ‌లోని పాల‌క్కాడ్. మ‌ల‌యాళీ అయిన అత‌డు కోల్‌క‌తాకు చెందిన మోహినిని పెళ్లిచేసుకున్నాడు. ఈయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు. అజిత్ కుమార్‌, అనూప్ కుమార్‌, అనీల్ కుమార్‌. వీరు కొన్ని రోజులు సికింద్రాబాద్‌లో కూడా నివాసం ఉన్నారు.  అజిత్ తండ్రి మరణించారని తెలిసి ఆయన ఫ్యాన్స్, పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అజిత్, షామిలీ స‌హా కుటుంబ స‌భ్యులంద‌రూ ఇప్పుడు యూర‌ప్ టూర్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే వారు త‌మ టూర్‌కి సంబంధించిన పొటోల‌ను నెట్టింట కూడా షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. తండ్రి మ‌ర‌ణ వార్త తెలియ‌గానే అజిత్ అండ్ ఫ్యామిలీ ఇండియాకు బ‌య‌లుదేరారు. ఈరోజు సాయంత్రం లోపు వారు ఇండియాకు చేరుకుంటార‌ని స‌మాచారం.  శుక్ర‌వారం సాయంత్రం చెన్నై బీసెంట్ న‌గ‌ర్‌లోని శ్మ‌శాన వాటిక‌లో అజిత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.

అజిత్ సైతం తెలుగు సినిమాల్లోనే ముందుగా నటించారు. ఆ త‌ర్వాతే త‌మిళ చిత్ర సీమ‌లోకి అడుగు పెట్టారు.
అజిత్ హీరోగా నటించిన రీసెంట్ సినిమా తునివు. ఈ సినిమాతో తన కెరీర్  లో మరో భారీ హిట్ అందుకున్న ఆయన.. నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్న అజిత్ కుమార్ అభిమానులకు అజిత్ తండ్రి సుబ్రమణియన్ మరణ వార్త షాకింగ్ పరిణామంగా మారింది. ఈ మధ్యకాలంలో అజిత్ వ్యక్తిగత విషయాలపై బోలెడన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తన భార్య షాలినికి ఆయన బ్రేకప్ చెప్పారనే న్యూస్ జనాల్లో హాట్ హాట్ డిస్కషన్ అయింది. కొద్ది రోజుల క్రితం నుంచి అజిత్, షాలిని విడిపోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే షాలినితో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసి ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అజిత్.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh