హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్..!

Happy Birthday Superstar mahesh

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు తండ్రికి తగ్గ వారసుడిగా మహేష్ తన స్టార్ డం కొనసాగిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అదరగొట్టిన మహేష్ హీరోగా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. రాజకుమారుడు సినిమాతో హీరోగా మొదటి సినిమా చేసిన మహేష్ ఆ సినిమా నుంచి తన సత్తా చాటుతున్నారు. ఇండస్ట్రీ రికార్డులను కొట్టే సినిమాలతో పాటుగా సమజాన్ని ప్రభావితం చేసే సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు మహేష్.

టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో మహేష్ ఒకరు. కేవలం హీరోగా మాత్రమే కాదు ఒక మంచి మనసున్న మనిషిగా కూడా ఫ్యాన్స్ కి ఆదర్శంగా నిలుస్తున్నారు మహేష్. ముఖ్యంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతోమంది చిన్నారులు వారి కుటుంబాలను ఆదుకుంటున్నాడు.

హాలీవుడ్ హీరో కటౌట్ తో మహేష్ చేస్తున్న అద్భుతాలు అన్ని ఇన్నీ కావు. శ్రీమంతుడు నుంచి వరుస హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ ప్రస్తుతం మాటల మంత్రికుడు త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి బర్త్ డే శుభాకాంక్షలు చెబుతుంది PregnyaMedia టీం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh