బిగ్ బాస్ కి పిలిచారు.. వాళ్లు నన్ను తట్టుకోలేరన్న మాధవి లత..!

Madhavi Lata Rejected BiggBoss Offer Here is the Reason

బిగ్ బాస్ కు ఎప్పటి నుంచో తనకు ఆఫర్ వస్తున్నా తాను మాత్రం వెళ్లలేదని అంటున్నారు నచ్చావులే హీరోయిన్ తెలుగు అమ్మాయి మాధవి లత. సినిమాల్లో అలా తళుకున్న మెరిసి పది దాకా ప్రాజెక్ట్ లు చకచకా చేసిన అమ్మడు ఆ తర్వాత సరైన ఛాన్స్ లు లేక సైలెంట్ అయ్యింది. హీరోయిన్ గా చేయకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వస్తున్న మాధవి లత ఆ సోషల్ మీడియా క్రేజ్ తోనే తను సర్వైవ్ అవుతుంది.

లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో బీజేపీ తరపున పోటీ చేసిన అమ్మడు కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి మళ్లీ తన సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలు పెట్టింది. బయట జరుగుతున్న విషయాల మీద, పాలిటిక్స్ మీద తన మార్క్ కామెంట్స్ చేస్తూ కెరీర్ సాగిస్తున్న మాధవి లత ప్రతిసారి ఏదో ఒక కామెంట్ తో వార్తల్లో నిలుస్తుంది. ఆ టైం లో ఎవరో ఒక యూట్యూబ్ ఛానెల్ వారు ఆమెను ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలా తన ఫాం కొనసాగిస్తుంది.

లేటెస్ట్ గా ఒక పాపులర్ యూట్యూబ్ ఛానెల్ కి వచ్చిన మాధవి లత బిగ్ బాస్ లో తనని భరించలేరని అందుకే వారు మంచి రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా సరే తాను వెళ్లదలచుకోలేదని అన్నారు. బిగ్ బాస్ లో 20 మంది మధ్యలో తాను ఉండలేనని.. తన ముందు ఏదైనా తప్పు జరిగితే అక్కడే కడిగిపారేస్తానని అవి బిగ్ బాస్ కి ఇబ్బందని అన్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా సరే తనే కావాలని వెళ్లట్లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు మాధవి లత.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh