సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నెల్సన్ మార్క్ ఎంటర్టైనర్ తో పాటుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను కూడా ఉండేలా చేశాడు. కోలీవుడ్ తో పాటుగా తెలుగులో కూడా రజినికి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారందరు రజిని జైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా జైలర్ వారి అంచనాలకు తగినట్టుగానే అదరగొట్టేసింది. ఇక రజిని జైలర్ కి పోటీగా చిరు భోళా శంకర్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి తన మెగా మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు చిరు.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ భోళా శంకర్ మీద కూడా మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. అయితే చిరు సినిమాకు పోటీగా వచ్చిన జైలర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో అయితే జైలర్ బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు. తెలుగులో అక్కడక్కడ మిక్సెడ్ టాక్ వినిపిస్తుంది. మరి ఈరోజు వస్తున్న భోళా శంకర్ జైలర్ ముందు నిలబడతాడా లేదా అన్నది చూడాలి. భోళా శంకర్ తో చిరు ఈ ఏడాది మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
దశాబ్ధ కాలంగా సినిమాల జోలికి వెళ్లని మెహర్ రమేష్ ఈ సినిమాతో మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఓ పక్క మెగా ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న డౌట్ వెంటాడుతున్నా మెగా సినిమాతో మెహర్ ఫాం లోకి వస్తాడని ఆశిస్తున్నారు. మరి మెహర్ రమేష్ భోళా శంకర్ ని ఏం చేస్తాడో మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.