థ్యాంక్యూ మామా అంటున్న మెగా  మేనల్లుడు

Thank you kalyan mama for your love

థ్యాంక్యూ మామా అంటున్న మెగా  మేనల్లుడు

మెగా వారి  మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్నాక వరుస ప్రాజెక్ట్‌లను సెట్స్ మీదకు తీసుకెళ్తు పుల్ బిజిబిజీ గా వున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన వినోదయ సిత్తం రీమేక్‌తో పాటు కార్తిక్‌ దండు దర్శకత్వంలో ‘విరూపాక్ష’ అనే థ్రిల్లర్‌ సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినిమాపై ఎక్కడేలేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఇక ఈ సినిమా టీజర్‌ మార్చి 1న రిలీజ్‌ కానునన్నట్లు చిత్రబృందం ఇటీవలే తెలిపింది. కాగా తాజాగా ఈ టీజర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వీక్షించాడు. ఇదే విషయాన్ని సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు.

విరూపాక్ష టీజర్‌ చూసి పవన్‌ కళ్యాణ్‌  చిత్రబృందాన్ని అభినందించినట్లు సాయిధరమ్ తేజ్‌ తెలిపాడు. ‘ఇంతకంటే ఇంకేమి అడగలేను. విరూపాక్ష మూవీ నాకెంతో కీలకం నా గురువు పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా టీజర్‌ చూసి బ్లెస్సింగ్స్‌ ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చింది. థ్యాంక్యూ మామా’ అంటూ పవన్‌ ఫోటోలను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థతులు ఎదురయ్యాయి. అసలు ఆ చావుల వెనక ఉన్న మిస్టరీ ఎంటీ అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టాక్‌. ఈ చిత్రంలో బ్లాక్‌ మేజిక్‌ వంటి అంశాలను టచ్‌ చేశారట. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 21న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh