రానున్న ఎన్నికలలో జీవిత అక్కడ నుండే బరిలోదిగానున్నది

Jeevitha Rajasekhar contest on BJP

రానున్న ఎన్నికలలో జీవిత అక్కడ నుండే  బరి దిగానున్నది

రెండు తెలుగు రాష్ట్రాలలో రానున్న ఎన్నికలు  చాలా ఆసక్తికరంగా సాగే అవకాశాలు వున్నాయి. కారణం ఏంటి అంటే, ఈసారి చిత్రపరిశ్రమ నుండి కొంతమంది రెండు రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం వుంది. పార్టీలు కూడా పరిశ్రమ నుండి ఎవరు వచ్చినా ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా కూడా వున్నాయి. ఇప్పుడు తెలంగాణ నుండి చిత్ర పరిశ్రమ తరపున పోటీ చేసే వారిలో జీవిత రాజశేఖర్ బరి వున్నారు. జీవిత బీజేపీ పార్టీ నుండి పోటీ ఖాయం అని కూడా తెల్సింది. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి ఎన్నికల సమయంలో ప్రచారం మాత్రమే చేసిన జీవిత ఈసారి బీజేపీ నుండి సీటు కచ్చితంగా వచ్చేట్టు చేసుకున్నారు.
ఈమధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున జీవిత చాలా గట్టిగా ప్రచారం చేసిన విషయం అందరకు తెలిసిందే. ఆ తరువాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, అలాగే ఈటేల రాజేందర్ నాయకత్వం లో జీవిత తరచూ బీజేపీ నాయకులను కలుస్తూ వున్నారు. ఈ తరుణంలో నే ఆమెకి రానున్న ఎన్నికల్లో సీటు ఖాయం చేసారని కూడా తెలిసింది. ఆమె మీద బీజేపీ నాయకత్వం చాల నమ్మకంగా ఉండబట్టే, ఆమెకి ప్రస్తుతం వికారాబాద్ నియోజక వర్గ ఇంచార్జి గా బాధ్యతలను బీజేపీ నాయకత్వం అప్పగించింది తెలిసింది. కనుక రానున్న ఎన్నికలకు బీజేపీ సిద్దమవుతుంది అని తెలుస్తుంది. అందులో భాగంగానే జీవిత రాజశేఖర్ ని వికారాబాద్ నియోజకవర్గానికి చాలా సార్లు వెళ్లి అక్కడ లోకల్ నాయకులను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీకిస్తున్నారని కూడా తెలిసింది. అలాగే అక్కడి నాయకులూ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా జీవిత ని కలుస్తున్నారని, మొత్తానికి జీవిత కి రానున్న ఎన్నికల్లో సీటీ ఖాయం అని తెలిసింది. అయితే ఆమె ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయం ఇంకా క్లారిటి లేదు. అందుకే జీవిత బీజేపీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆమె పోటీ చేసే నియోజకవర్గం చెపితే, ఇప్పటి నుండే నియోజవర్గం లోని  నాయకులతో కలిసి విజయం కోసం పనిచెయ్య వచ్చు అని ఆమె అనుకుంటున్నది.

ఇది కూడా చదవండి :

Leave a Reply