సుహన్ పై ప్రశంశలు కురిపిచిన మహేష్ బాబు..

maheshbabu appreciate actor suhas

సుహన్ పై ప్రశంశలు కురిపిచిన మహేష్ బాబు..

షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా నటిస్తూ తక్కువ కాలంలోనే తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ‘సుహాస్’. ఇటీవల హిట్-2 సినిమాలో సీరియల్ కిల్లర్ గా కనిపించి అందరి  మన్నలు  పోదుతున్నాడు. కలర్ ఫొటోతో హీరోగా పరిచమైన సుహాస్  హీరోగా తన రెండో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ‘రైటర్ పద్మభూషణ్’ అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది. ప్రమోషన్స్ లో భాగంగా రెండు రోజులు ముందు నుంచే పలు దియేటర్ల లలో  జనరల్ ఆడియన్స్ కి ప్రీమియర్ షోలు వేస్తూ సందడి చేశాడు సుహాస్. అయితే ప్రీమియర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకోవడంతో  మంచి ఓపెనింగ్స్ అందుకుంది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశాడు. మూవీ బాగా నచ్చడంతో చిత్ర యూనిట్ ని తన ఇంటికి పిలిపించుకొని మరి అభినందించాడు. ”రైటర్ పద్మభూషణ్ సినిమా హృదయానికి హత్తుకునే సినిమా, ముఖ్యంగా క్లైమాక్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది” అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే  ఈ సినిమాలో నటించిన సుహాస్ యాక్టింగ్ బాగా నచ్చింది అంటూ సుహాస్ పై మహేష్ ప్రశంసలు కురిపించాడు. చిత్ర యూనిట్ తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు . చిత్ర యూనిట్ కి సక్సెస్ అందుకున్నందుకు అభినందనలు తెలిపాడు.  కాగా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్టుగా దూసుకుపోతుంది. రెండు రోజులోనే 3.6 కోట్ల  కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో అయితే 175k డాలర్స్ వసూలు చేసి దూసుకుపోతుంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh