కోడలి నాని కి థాంక్స్ చెప్పిన రేణుకా చౌదరి

renuka chowdhury comments on kodali

కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోన్న గుడివాడ నుంచే వచ్చే ఎన్నికలలో  బరిలోకి దిగబోతున్నట్లు చెప్పారు రేణుకా చౌదరి. అటు తెలంగాణా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా తనను పోటి చేయమంటు  ఆమె పై ఫోర్సు చేస్తున్నారని తెలిపారు. అందులో బాగంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని  టార్గెట్‌ చేస్తూ నేను గుడివాడ నియోజక వర్గం నుండి పోటి చేయడానికి చూస్తున్న అని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా.  రాబోయ్ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తూనే గుడివాడలో కూడా పోటీ చెయ్యాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు రేణుకా. సోమవారం మీడియాతో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ఫైర్‌ బ్రాండ్‌ రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.  రెండు తెలుగు రాష్ట్రాలలోను పోటీ చేస్తే తప్పేంటి అన్నారు.

కాగా రేణుకా చౌదరి అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మద్దతు తెలిపి వారి పాదయాత్ర లో కూడా పాల్గొన్నా  సంగతి విదితమే.  దానికి కోడలి నాని ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని అని రేణుకా చౌదరిని  వెంగ్యంగా విమర్శించారు. ఆ విమర్శలకు ఆమె తాజాగా  ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందిస్తూ  బుజ్జీ నీకు చెరిత్ర తెలిదు, లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ని, బుజ్జీ నీకు రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఫోన్ లో గూగుల్ కొట్టు, రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. అలాగే నీ చరిత్ర ఏమిటో నీకు తెలుస్తుంది.  నువ్వు మాజీ మినిస్టర్ కదా నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి నాకు చాల పబ్లిసిటి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటు ఆమె కోడలికి కౌంటర్ ఇచ్చారు.

అలాగే నాకు మంచి ఐడియా ఇచ్చాడు కోడలి నాని, ఆ  ఐడియా ఇవ్వడంతో ఆయనకు తగిన జవాబుగా అయన నియోజక వర్గం నుండి పోటి చేస్తా. నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా   పోటి చేయలేదు, మున్సిపల్ కార్పొరేటర్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేశా. కానీ నాని ఇచ్చిన ఐడియా తో నేను  ఎం.ఎల్.ఎ గా పోటి చేసి తప్పకుండా గెలుస్త అని అన్నారు రేణుకా.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh