వాహనదారులకుగుడ్ న్యూస్ అక్కడ హెల్మెట్ లేకపోయినా జరిమానా లేదు

Good news for motorists There is no fine even if there is no helmet there

వాహనదారులకుగుడ్ న్యూస్ అక్కడ హెల్మెట్ లేకపోయినా జరిమానా లేదు

వాహనదారులకు ఏపీ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. హెల్మెట్ లేని వారికి జరిమానాలు వేయకండి కౌన్సిలింగ్ మాత్రమే ఇవ్వండి అలాగే పోలీసులు నిర్దేశించిన ప్రకారం ఖాళీ ప్రదేశాల్లోనే బహిరంగ సభలు పెట్టుకోవాలని, ఇరుకైన ప్రదేశాల్లో సభలు అంగీకరించేది లేదని డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రాజమండ్రి  లో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన డీజీపీ  అనంతరం అనపర్తి కేసులపై దర్యాప్తు వివరాలు త్వ‌ర‌లో వెల్లడిస్తామన్నారు. ప్రతిపక్షాలు గొంతుక మేమెందుకు నొక్కుతామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కళాశాలల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టామని  సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 2022లో మహిళలపై జరిగిన రేప్  పొక్సో మరియు అత్యాచార కేసులపై నమోదైన ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు డీజీపీ. జిల్లాకు సుమారు 05 కేసుల చొప్పున తీసుకొని 07 రోజులలో దర్యాప్తు పూర్తి చేసి దాదాపు 108 కేసులలో చార్జీ పీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. గుర్తించిన కేసులలో ఇప్పటికే 48 కేసులకు సంభందించిన విచారణ పూర్తి చేసామని, జీవిత ఖైదు మరియు 07 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోపు శిక్ష విధించగా  13 కేసులలో విచారణ పూర్తి కాబడి తీర్పు రిజర్వు చేయబడి ఉన్నాయని  మరో 47 కేసులలో విచారణ ముగింపు దశలో ఉందన్నారు. పోక్సో యాక్ట్ సంబంధించి 101 కేసులలో న్యాయస్థానంలో కఠినమైన శిక్షలు విధించడం జ‌రిగింద‌ని, 2022 వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46 కేసులలో జీవిత ఖైదు మరియు 07 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష వంటి కఠినమైన శిక్షలు పడ్డాయని డీజీపీ వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ స్ఫూర్తితో నాణ్యమైన పరిశోధనలు చేసి అత్యంత తక్కువ సమయంలో చార్జీ షీటు దాఖలు చేయడమేకాక తక్కువ టైమ్ లో విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న‌ట్లు తెలిపారు డీజీపీ.

ఈ సంవత్సరం రాయిచోటిలో ఒక మహిళ పై అత్యాచారం , హత్య మరియు కోనసీమలో సమీప బంధువుపైన అత్యాచారం మరియు హత్యాయత్నం ఏలూరు  జిల్లాలో తల్లి , కూతురును అమానుషంగా హత్య , బాపట్ల జిల్లాలో యువతిని ప్రేమ పేరుతో వేధించి హత్యయత్నం మరియు . గుంటూరు  జిల్లాలో అంధురాలిని నిత్యం వేధింపులకు పాల్పడుతూ ఆమెపై దాడి చేసిన కేసులోను 07 రోజులలో దర్యాప్తు పూర్తి చేసి, చార్జీ షీటు దాఖలు చేయగా విచారణ కొనసాగుతుందన్నారు. అక్టోబర్ 2022 వ సంవత్సరంలో కాకినాడలో ఒక యువతిని దారుణంగా దారి కాచి హత్య చేసిన కేసులో 107 రోజులలోపు చార్జీ షీటు దాఖలు చేయగా 144 రోజులలో విచారణ పూర్తికాబడి ముద్దాయికు యావజ్జీవ కారాగార శిక్ష పడిందన్నారు. మహిళా పోలీసుల ద్వారా చిన్న చిన్న గొడవలు పరిష్కారం వెంట‌నే జ‌రుగుతు న్నాయ‌న్నారు. గత ఏడాది వ్యవధిలో 77వేల కేసులు తగ్గించామని, ఏపీపోలీస్ శాఖకు ఇది చాలా పెద్ద ఘనత అన్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh