ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన రోజా

Roja's interesting tweet on Andhra Pradesh's capital

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిన రోజా

ఏపీ  రాజధాని విషయంలో జగన్ సర్కారు ఇంతకు ముందు మూడు రాజధానులని చెప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం .అయితే  జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రూట్ మార్చారు. అభివృద్ధి ఏదో ఒక ప్రాంతానికి పరిమిత కావొద్దనే ఉద్దేశంతో జగన్ సర్కారు మూడు రాజధానులంటూ గళం వినిపించింది. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదించింది. కానీ 2021 చివర్లో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. కానీ   ఇప్పుడు ఏమో  విశాఖ నగరమే రాజధాని అని చెబుతోంది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మీట్ కర్టెన్ రైజ్ కోసం ఈ మధ్యకాలంలో  ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్. విశాఖే రాజధాని అని తేల్చి చెప్పారు. తాను కూడా త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలు పెడతానని చెప్పారు. విశాఖ నగరంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ వాడు వెక్కిరించినా మద్రాస్ వాడు వెళ్లగొట్టినా హైదరాబాద్ వాడు గెంటేసినా మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చిదిద్దుతాం – నిజమైన ఆంధ్రోడు’’ అంటూ రోజా ట్వీట్ చేశారు. అంటే అసలైన ఆంధ్రావాళ్లు ఎవరైనా రాష్ట్ర పురోగతిని కాంక్షించే వాళ్లు ఎవరైనా సరే విశాఖను రాజధానిగా అంగీకరిస్తారని రోజా ఈ ట్వీట్ చేశారు. 1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్ స్టేట్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌‌గా అవతరించింది. యూపీఏ సర్కారు నిర్ణయంతో 2014లో రాష్ట్రం మళ్లీ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుభవాలన్నీ గుర్తుకు తెచ్చేలా రోజా ట్వీట్ చేశారు. చెన్నై, హైదరాబాద్ నగరాలకు ధీటుగా వైజాగ్‌ను అభివృద్ధి చేసుకుందామనే భావన ఆమె ట్వీట్‌లో వ్యక్తమైంది. మరి మూడు రాజధానులు ఏమయ్యాయి? అని నెటిజన్లు మంత్రి రోజాను ప్రశ్నిస్తున్నారు. తన ట్వీట్‌కు కామెంట్ చేసే ఆప్షన్‌ను రోజా తీసేసినప్పటికీ కోట్ ట్వీట్ ఆప్షన్ ద్వారా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని జగన్ సర్కారు భావిస్తోంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh