ఆస్కార్ ను సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్

naatu naatu song from rrr movie won Oscar award 2023

RRR Oscar :ఆస్కార్ ను సొంతం చేసుకున్న నాటు నాటు సాంగ్

అస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట మార్మోగుతుంది. ఇప్పటికే యూట్యూబ్, టిక్ టాక్ లో రికార్డులు క్రియేట్ చేయటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఎంతో ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ అందరూ ఎదురు చూసిన కల నేరవేరింది. అందరి ఆశలను మోసుకుంటూ లాస్ ఏంజిల్స్‌లో అడుగు పెట్టిన RRR ఆస్కార్ విజేత‌గా నిలిచింది. నాటు నాటు పాట‌ను ఆస్కార్ అవార్డ్ వ‌రించింది. ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో నాటు నాటుకి ఈ అవార్డు రావ‌టంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఎనిమిది దశాబ్దాలు దాటిన తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఇది. దీనిపై యావత్ తెలుగు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. RRR టీమ్‌కి అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అభినందనలను తెలియజేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ కూడా ఆర్ఆర్ఆర్ కావటమే విశేషం.

చంద్రబోస్ గారు ఈ మూవీలో పాట రాయటానికి దర్శకుడు రాజమౌళి దగ్గరకు వెళ్లినప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు.  అచ్చ తెలుగులో ఉండాలి ఎక్కడా ఇంగ్లీష్ పదాలు వాడొద్దు అంతే కాకుండా ఎవర్నీ కించపరిచే విధంగా పదాలు ఉండకూడదు తిట్టినట్లు ఉండకూడదు కేవలం మన పౌరుషం మనలోని నిజాయితీ మన మట్టి మనిషి జీవితాన్ని పాట ద్వారా ఆవిష్కరించగలిగితే చాలు అని స్పష్టం చేశారంట రాజమౌళి ఈ విధంగా పాట రాయటానికి చాలా కాలం పట్టిందన్నారు చంద్రబోస్. 90 శాతం పాట నెల రోజుల్లోనే అయిపోయిందని. మిగతా 10 శాతం పాట కంప్లీట్ కావటానికి 19 నెలలు పట్టిందన్నారు చంద్రబోస్ దీని కోసం 35 రకాలుగా పాడారని పలు రకాలుగా పలు విధాలుగా కొన్ని నెలల పాటు ప్రయోగం చేయటం జరిగిందన్నారు. ప్రతి పదం ప్రతి అక్షరం పూర్తి పాట రూపంలోకి తీసుకురావటానికి 19 నెలలు పట్టిందని ఆ కష్టానికి ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ తో గుర్తింపు లభించిందన్నారు.

అయితే చంద్రబోస్ కు  బాహుబలిలో పాటలు రాసే అవకాశం రాలేదు ఆర్ఆర్ఆర్ లో వచ్చిన అవకాశంతో ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావటం జీవితానికి సార్థకత వచ్చిందన్నారు చంద్రబోస్. ఈ పాటను రాజమౌళి 17 రోజుల పాటు చిత్రీకరించారు. వారం రోజుల పాటు పాటను రిహార్సల్ చేసి షూట్ చేశారు. 150 మంది డాన్సర్స్, 200 మంది యూనిట్ సభ్యులతో ఈ పాట చిత్రీకరణంతా సాగింది. కీరవాణి సంగీత సారథ్యం వహించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh