యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ చేస్తూ పాపులర్ అయ్యి ఆ తర్వాత యూట్యూబ్ సీరీస్ లతో క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో సోలో హీరోయిన్ గా ఐడెంటిటీ ఏర్పరచుకుంది. అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వైష్ణవి బేబీ లో టైటిల్ లీడ్ రోల్ చేసి ఆడియన్స్ ని మెప్పించింది. హీరోయిన్ గా మొదటి సినిమానే తన అభినయంతో అందరిని మెప్పించింది అమ్మడు.
బేబీ హిట్ ఆమెకు చాలా అవకాశాలు వచ్చేలా చేస్తుంది. అయితే ఈ టైం లోనే వైష్ణవి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక హిట్ పడగానే అరడజను అవకాశాల దాకా వస్తాయి. కానీ వాటిలో ఏది పర్ఫెక్ట్ అని అన్నది ఆమె డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆఫర్లు వచ్చాయి కదా అని చేస్తూ వెళ్లకుండా మళ్లీ బేబీ లాంటి హిట్ పడే సినిమాలే చేయడం ఆమెకు మంచింది. ఐతే బేబీ తరహా కథలు మళ్లీ రావడం కష్టం కానీ హీరోయిన్ గా పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.
తెలుగు సినిమాల్లో తెలుగు కథానాయికలు తగ్గుతున్నారనుకుంటున్న టైం లో వైష్ణవి చైతన్య తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. మరి అమ్మడు ఇదే ఫాం కొనసాగిస్తూ టాలీవుడ్ లో స్టార్ రేంజ్ దక్కించుకోవాలని ఆశిద్దాం. బేబీ తర్వాత తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా ఫొకస్ గా ఉంది వైష్ణవి. అయితే ఆ సినిమా ఏంటన్నది తెలియాల్సి ఉంది.