రష్మిక ఎనదర్ లక్కీ ఛాన్స్..!

Rashmika Another Lucky Chance in Kollywood Dhanush movie

కన్నడ భామ రష్మిక మందన్న ఖాతాలో మరో లక్కీ ఛాన్స్ వచ్చి చేరింది. కన్నడలో కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అయిన అమ్మడు తెలుగులో ఛలోతో ఎంట్రీ ఇవ్వడమే హిట్ అందుకుంది. ఆ సినిమా నుంచి తన టాలెంట్ తో స్టార్ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించి నేషనల్ క్రష్ అయిన రష్మిక బాలీవుడ్ లో కూడా సినిమా ఛాన్స్ లు అందుకుంది. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో తన టాలెంట్ చూపించబోతుంది అమ్మడు.

ఆల్రెడీ తమిళంలో కార్తీ, విజయ్ ల సరసన జోడీ కట్టిన రష్మిక లేటెస్ట్ గా ధనుష్ తో రొమాన్స్ కి రెడీ అవుతుంది. ధనుష్ హీరోగా శేఖర్ మమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక నటించడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలుగులో సీతారామం తర్వాత నితిన్ సినిమా సైన్ చేసిన రష్మిక ఆ సినిమా నుంచి కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం చేతిలో సినిమాలేవి లేని టైం లో రష్మికకు ధనుష్ సినిమా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. శేఖర్ కమ్ములతో ధనుష్ సినిమా అసలైతే లాస్ట్ ఇయరే సెట్స్ మీదకు వెళ్లాల్సింది కానీ ఎందుకో లేట్ అయ్యింది. రష్మిక ఈ సినిమాతో కోలీవుడ్లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh