77వ స్వాతంత్య్ర వేడుకులు దేశ వ్యాప్తంగా భారీగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. మోది ప్రధానిగా పదోసారి ఎర్రకోటలో జెడా ఎగురవేశారు.. దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డ్ సమం అయ్యింది. జెండా ఆవిష్క రణకు ముందు రాజ్‌ఘాట్ లోని జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు మోడీ. జెండా ఆవిష్క రణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. నా కుటుం బంలోని 140 కోట్ల మంది సభ్యులు ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నా రు.. వారికి నా శుభాకాం క్షలు.. భారత స్వాతంత్య్ర పోరాట లో తమ వంతు సహకారం అందించిన మహాత్ము లకు నా నివాళులు అర్పిస్తున్నాను అని అన్నా రు.
బాపూజీ చూపించిన అహింసా మార్గంలోనే స్వాతంత్య్రం సాధిం చామని పేర్కొ న్నా రు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేనని, దేశం కోసం ఎంతో మం ది ప్రాణ త్యాగం చేశారని వెల్లడిం చారు. ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాత్మ క ఘటనల ఫై కూడా మోడీ స్పందించారు. త్వరలోనే అక్క డ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్నా రు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంది. ప్రజలు ఈ శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. శాంతి ద్వారానే దేశం వృద్ధి చెందుతుంది. శాంతిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నా లు చేస్తున్నాయని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతాయన్నారు.
దేశంలోని యువతకు లభించినంత సౌలభ్యం మరెవరికీ దక్కడం లేదన్నా రు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ప్రభావితమవుతుందని.. జనాభా, విస్తీర్ణం పరంగా కొన్ని నగరాలు, పట్టణాలు చిన్నవే కావచ్చని కానీ అక్కడ ప్రజల సామర్థ్యం దేనికీ తీసిపోదన్నా రు.
2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 10వ స్థానంలో ఉండగా.. ఈ రోజు 5వ స్థానానికి చేరుకున్నాం. అప్పు డు అవినీతి దేశాన్ని పట్టిపీడించింది. 10 సంవత్సరాల లెక్కలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నాను. గతంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారు. నేడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు. గత ఐదున్నరేళ్లలో 5.13 కోట్ల మం ది పేదరికం నుంచి బయటపడినట్లు మోడీ తెలిపారు.
అలాగే వచ్చే నెలలో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విశ్వకర్మ పథకంలో రూ.15,70 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. ఇక ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకుల్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్.. బీజేపీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.