33 శాతం పదవులు మహిళలకే అంటున్న జనసేనాని..!

Pawan Kalyan Janasena Party 33 % Ladies Reservation

జ‌న‌సేన పార్టీలో 33 శాతం ప‌ద‌వుల‌ను మ‌హిళ‌ల‌కే ఇవ్వ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్లడించారు. మ‌హిళ‌ల‌కు మంచి స‌మున్న‌త స్థానం ఇచ్చిన దేశం ఇంకా పార్టీలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని ఆయన అన్నారు. జనసేన మ‌హిళా విభాగం వీర మహిళలతో తాజాగా ఆయ‌న విశాఖ ప‌ట్నంలో భేటీ అయ్యారు. దేశ స్వాతంత్య్రోద్య‌మంలో మ‌హిళ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపడం కుదరదని అన్నారు పవన్.

మధ్య తరగతి,పేద మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ‌ మేధస్సుతో రాణించాలని ప‌వ‌న్‌ కళ్యాన్ అన్. జనసేనలో వీర మహిళలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నామ ని చెప్పారు. జనసేన కార్యక్రమాల్లో మూడో వంతు మహిళలు ఉంటారని అన్నారు జనసేనాని. మ‌హిళల‌కు అండ‌గా ఉండేలా.. అనేక కార్య‌క్ర‌మాల‌ను గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు. వ‌చ్చే మేనిఫెస్టోలోనూ.. ఇదే త‌ర‌హాలో ముందుకు సాగుతామ‌న్నారు.

రాష్ట్రంలో మ‌హిళ‌లు, మైన‌ర్ బాలిక‌లు అదృశ్యం అవుతున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం కూడా గ‌గ్గోలు పెడుతోంద‌ని.. అయినా.. ఈ ముఖ్య‌మంత్రికి ఈ విష‌యంపై దృష్టి పెట్టేందుకు తీరిక లేకుండా పోయింద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వేల మంది మ‌హిళ‌లు అదృశ్య‌మ‌వుతుంటే.. వారిని గుర్తించాల‌నే ఇంగితం సిగ్గు కూడా ఈ ముఖ్య‌మంత్రికి లేదని ప‌వ‌న్ అన్నారు. భవిష్యత్తులో జ‌న‌సేన అధికారంలోకి రాగానే మ‌హిళ‌లకు సరైన స్థానం ఇస్తామ‌న్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh