విజయ్ తో దివ్యాన్ష.. బ్రేక్ ఇచ్చేందుకు రెడీ..!

Vijay Romance with Divyansha Kowshik

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. అతని సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అని లెక్క లేకుండా బజ్ తెచ్చుకుంటాయి. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు అతనికి ఈ స్టార్ డం తెచ్చి పెట్టాయని చెప్పొచ్చు. అయితే డియర్ కామ్రేడ్ నుంచి వరుస ఫ్లాపులు చేస్తున్న విజయ్ రాబోతున్న ఖుషితో సక్సెస్ ట్రాక్ ఎకాలని చూస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా తర్వాత విజయ్ గీతా గోవిందం డైరెక్టర్ పరశురాం డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. మృణాల్ తో పాటుగా విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

మజిలీ, రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన దివ్యాన్ష సిద్ధార్థ్ టక్కర్ లో కూడా నటించింది. సినిమాల పరంగా అంత హిట్లు లేకపోయినా గ్లామర్ పరంగా అమ్మడు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వచ్చింది. అందుకే అమ్మడికి టాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక విజయ్ సినిమాలో దివ్యాన్ష అనగానే రౌడీ ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు. మరి అమ్మడికి విజయ్ బ్రేక్ ఇస్తాడో లేదో చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh