తాగిన మత్తులో ఈఫిల్ టవర్ పై నిద్రపోయిన టూరిస్టులు.. తర్వాత ఏమైందంటే..!

Drunked tourists sleeping on eiffel tower france news

మందు తాగడం అలవాటు పడిన తర్వాత దానికి లిమిటేషన్స్ అనేవి క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. రోజు తాగే దాని కన్నా ఈరోజు కాస్త ఎక్కువ తాగేద్దాం అనుకుంటూ ఫుల్లులకు ఫుల్లులు లేపేస్తుంటారు. ముఖ్యంగా కొత్త ప్రదేషాలకు వెళ్లినప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది. అలానే పర్యాటక ప్రాంతంగా చెప్పుకునే ఫ్రాన్స్ ఈఫిల్ టవర్ ఏరియాలో పీకల దాకా తాగి ఆ మత్తులో ఈఫిల్ టవర్ ఎక్కి అక్కడే నిద్ర పోయారు ఇద్దరు వ్యక్తులు. టవర్ లో సెక్యురిటీ కళ్లు గప్పి నైట్ టైం అక్కడే ఉన్నారు. టూరిస్ట్ లు చేసిన ఈ పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఫ్రాన్స్ లో అత్యంత చూడదగ్గ ప్రదేశాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. అది చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్ట్ లు వస్తుంటారు. అయితే బస చేసే టైం లో వైన్ తీసుకుని కూడా అక్కడకు వస్తారు. అయితే ఓ ఇద్దరు టూరిస్ట్ లు బాగా మందు తాగి ఈఫిల్ టవర్ ఎక్కారు. సందర్శన సమయం అయిపోయాక టూరిస్ట్ లను సెక్యొరిటీ కిందకి దింపినా వాళ్లు వాళ్లని ఏమార్చి పర్మిషన్ లేని రెండు మూడు లెవల్స్ కి వెళ్లి అక్కడ నిద్ర పోయారు.

ఆ తర్వాత రోజు సెక్యురిటీ గాస్తీ టైం లో వారిద్దరు అక్కడ ఉన్నట్టు కనిపెట్టారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి ఫైర్ ఫైటర్లు, రెస్క్యూ టీం తో వారిని జాగ్రత్తగా కిందకు దింపారు. అయితే వారిద్దరిని పారిస్ పోలీస్ స్టేషన్ కు తరలించారని ఇద్దరిపై క్రిమినల్ కేస్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh