NTR Movie ఎన్టీఆర్ సినిమా టైటిల్ లీక్..

NTR Movie ఎన్టీఆర్ సినిమా టైటిల్ లీక్..

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. అలాగే, ఇటీవలే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి క్లారిటీ ఇచ్చింది.జనతా గ్యారేజ్’ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ NTR Movie – కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గతంలో దీనికి ‘రుద్ర’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై మరో న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ టైటిల్‌ను గతంలో పవన్ కల్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించాడు.ఇద్దరు స్టార్ల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను నందమూరి NTR Movie రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

స్క్రిఫ్ట్ దశలో ‘ఆర్ఆర్ఆర్ 2’

దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ . జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడం ప్రారంభమయిన తర్వాత ఈ సినిమాపై విదేశీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. వెస్ట్రన్ ఆడియన్స్‌ను చిత్రం ఆకట్టుకోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిచింది.

వివిధ కేటగిరీల్లో పురస్కారం కోసం పోటీపడుతుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్క్రీనింగ్‌ను చికాగోలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. మూవీ స్క్రీనింగ్ అనంతరం క్వశ్చన్ అండ్ అన్సర్ సెషన్‌లో జక్కన్న పాల్గొన్నాడు. అందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై స్పందించాడు. చికాగోలో జరిగిన ఈ‌వెంట్‌లో ‘ఆర్ఆర్ఆర్ 2’ (RRR 2) పై రాజమౌళి మాట్లాడాడు. ‘‘నా అన్ని సినిమాలకు మా నాన్నే స్టోరీ రైటర్‌గా పనిచేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై మా నాన్నతో చర్చించాను.

ప్రస్తుతం కథపై పనిచేస్తున్నాడు’’ అని జక్కన్న తెలిపాడు. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతరామరాజు, కొమరం భీమ్ పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’ ను  పీరియాడిక్ డ్రామాగా రూపొందించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైంది. ఆ దేశంలోను సంచలన వసూళ్లను రాబడుతుంది.

పుష్ప 2 అప్‌డేట్ కోసం గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సీక్వెల్ ‘పుష్ప- ది రూల్’ అప్‌డేట్ ఆలస్యం అవుతోందంటూ అభిమానులు ఆందోళనకి దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు పెద్ద సంఖ్యలో అల్లు అర్జున్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ‘పుష్ప – ది రైజ్’ ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ అయ్యింది. అలానే కలెక్షన్లలోనూ కొత్త రికార్డ్ సృష్టించింది. దాంతో పుష్ప సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి.కానీ.. పుష్ప-2 పై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.

ఈ నెల ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభమైందని చెప్తున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వాస్తవానికి ఈ ఏడాదిలోనే పుష్ప-2 మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాలతో ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తవలేదు. దాంతో ఆగ్రహించిన అల్లు అర్జున్ అభిమానులు.. మైత్రీ మూవీ మేకర్స్‌ తీరుని తప్పుబడుతూ కనిపించారు. ఇదే పంథాని కొనసాగిస్తే నెక్ట్స్ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని ఫ్యాన్స్ హెచ్చరిస్తూ కనిపించారు.

పుష్ప సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇటీవల జరిగిన 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పుష్ప మూవీకి ఏకంగా 7 అవార్డులు రావడం గమనార్హం. డిసెంబరు 16న అవతార్ -2 సినిమా రిలీజ్ కానుండగా.. ఆ మూవీతో పాటు పుష్ప- 2 గ్లింప్స్‌ని కూడా థియేటర్లలో వేయబోతున్నట్లు సమాచారం.

బాస్ పార్టీకి సిద్ధంగా ఉండండి..

మెగాస్టార్ చిరంజీవిహీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ . బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది. ఓ వైపు ఫైన‌ల్ లెగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ.. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను కూడా కంప్లీట్ చేసుకుంటోంది.

మెగా ఫ్యాన్స్ సినిమా అప్‌డేట్స్ గురించి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ త‌రుణంలో సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఓ క్రేజీ విష‌యాన్ని చెప్పి మెగా ఫ్యాన్స్‌ని సంతోషంలో ముంచెత్తారు. ఇంత‌కీ మ‌న రాక్‌స్టార్ ఏం చెప్పారో తెలుసా!. ఈ వారం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి తొలి పాట రానుందని.

‘‘ఇప్పుడే పాట‌ను చూశాను. మెగాస్టార్ ఎన‌ర్జీకి దిమ్మ తిరిగిపోయింది. అందుక‌నే ముందుగానే విష‌యాన్ని లీక్ చేసేస్తున్నాను. వ‌చ్చే వార‌మే తొలి పాట రానుంది. పార్టీ కోసం రెడీగా ఉండండి. ఎందుకంటే అది బాస్ పార్టీ అని అన్నారు దేవిశ్రీ ప్రసాద్. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రమోషన్స్ విషయంలోనూ ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తొలి పాటను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

ఇద్ద‌రు అన్న‌దమ్ములుగా క‌నిపించ‌నున్నారు. ఇద్ద‌రు మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు న‌టిస్తోన్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ఫ్యాన్సీ రేటుకు థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడైన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh