దళపతి విజయ్ లియో.. ఆల్ టైం రికార్డ్ బిజినెస్..!

Vijay Leo Pre Release Business Details World Wide

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా లియో. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి రంగంలోకి దిగుతుంది. అయితే లియో మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కమల్ హాసన్ విక్రం తర్వాత లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

విజయ్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ కూడా జరుగుతుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ లియో సినిమా వరల్డ్ వైడ్ గా 400 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. లోకేష్ విక్రం 400 కోట్లు కలెక్ట్ చేయడంతో పాటుగా విజయ్ ప్రతి సినిమా 200 కోట్ల పైన కలెక్ట్ చేస్తున్న కారణంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న లియో సినిమా 400 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తుంది.

ఈ సినిమా విషయంలో తెలుగు ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లియో సినిమా తెలుగు రిలీజ్ కూడా భారీగా ఉండబోతుందని టాక్. అయితే తెలుగు బిజినెస్ ఎంతకు బేరం తెగింది అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఏది ఏమైనా విజయ్ లియో భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh