ప్రభాస్ నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రాజెక్ట్ కె అదేనండి కల్కి 2898 AD సినిమా గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. సినిమాలో ప్రభాస్ ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు అన్నది టీజర్ చూస్తే అర్ధమవుతుంది. కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్, కమల్ హాసన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా మలయాళ స్టార్ హీరో కూడా ఉన్నాడని అంటున్నారు.
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ప్రభాస్ కల్కి లో భాగం అవుతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో నటించాడు దుల్కర్ అదే సెంటిమెంట్ తో ఇప్పుడు 500 కోట్ల బడ్జెట్ తో వస్తున్న కల్కి సినిమాలో కూడా దుల్కర్ ని తీసుకోవాలని అనుకున్నాడట.
కల్కి సినిమాలో దుల్కర్ సెకండ్ హాఫ్ లో 10 నిమిషాల రోల్ ఉంటుందని సినిమా హైలెట్ అయ్యే అంశాల్లో దుల్కర్ ఎపిసోడ్ కూడా ఒకటని చెబుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో దుల్కర్ కి ఉన్న ఫాలోయింగ్ కల్కి సినిమాకు కూడా ప్లస్ అవుతుంది. కల్కి సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసినా ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.