మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి.

రాంచరణ్-ఉపాసన పెళ్లై చాలా కాలం అవుతున్నా,తమతో పాటు పెళ్లిచేసుకున్న అల్లు అర్జున్ అండ్ తన స్నేహితుడు ఎన్టీఆర్ ఇద్దరేసి పిల్లలను కన్నా …రాంచరణ్ దంపతులు మాత్రం ఎందుకనో పిల్లలకి ప్లాన్ చేయలేదు .. ఇంత కాలం పిల్లల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పిల్లలు ఎప్పుడు? అనే ప్రశ్నకు ఇటు ఉపాసన గానీ, అటు రాంచరణ్ గానీ ఎలాంటి సమాధానం చెప్పేవారు కాదు …ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన సహనంతో వాటన్నిటీనీ ఫేస్ చేస్తూ వచ్చారు… గతంలో ఓసారి పిల్లల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన.. సరైన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తామని తెలిపారు.

ఇప్పుడు తాత కాబోతున్నట్లు అధికారికంగా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు .. తన ఆనందాన్ని ఫాన్స్ తో పంచుకున్నారు …ఇన్నాళ్లకు ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. రాంచరణ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నారు. హనుమాన్ ఆశీస్సులతో ఉపాసన, రాంచరణ్ తమ తొలి బిడ్డ (Ram Charan, Upasana To Become Parents)ను కనబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు…ఈ పోస్ట్ తో మెగా అభిమానులుసంబరాలు చేసుకుంటున్నారు ..