పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ ?

వారాహి వాహనం రంగుం పై వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కూడా అధికార పార్టీ నేతల విమర్శలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి వివాదాల అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. పవన్ కళ్యాణ్ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. పవన్‌ ‘వారాహి’ వాహనానికి ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. వారం రోజుల క్రితమే TS 13 EX 8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తి అయింది అని అధికారులు పేర్కొన్నారు. ‘వారాహి’ కలర్‌ ఆలివ్ గ్రీన్‌‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని రెండిటికి మధ్య సిమిలర్ కలర్ వెరియేషన్ ఉంది అని అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని స్పష్టం చేశారు . పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార వాహనంగా చెబుతున్న ‘వారాహి’ వాహనం రంగు ‘ఆర్మీ’ వాహనాల రంగును పోలి ఉండటంతో ఈ వాహనం గురించి పెద్ద రచ్చ జరిగింది .అయితే.. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం..

చాప్టర్ 121లో ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది. డిఫెన్స్ శాఖకు చెందిన వాహనాలకు తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకూ ఆలివ్ గ్రీన్ కలర్ పెయింటింగ్‌ వేయకూడదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పవన్ ప్రచార రథమైన ‘వారాహి’కి ఎమరాల్డ్ గ్రీన్ పెయింటింగ్ వేయడంతో ఈ వివాదానికి దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టే కనిపిస్తోంది.ఇటీవల కాలంలో పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఘటన ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా… చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.వేలమందికి స్పష్టంగా వినిపించేలా యూనిక్ సౌండ్‌ సిస్టమ్‌ వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాల రీత్యా వాహనానికి అన్ని వైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వెహికల్ లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునేలా , వాహనం లోపలి నుంచే పైకి వెళ్లడానికి హైడ్రాలిక్‌ మెట్లు ఉన్నాయి .

Dimple Hayathi In Shankars Movie keerthi suresh