Balakrishna: మజాకా..డీల్ క్లోజ్ అయింది.
బాలకృష్ణ ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన మాస్ ఎంటర్టైనర్ “దసరా” రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ విషయంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
అదే తరంలో నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది డిసెంబర్ నుంచి నందమూరి బాలకృష్ణ మాంచి రైజింగ్‌లోకి అడుగుపెట్టారు. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన `అఖండ` అనూహ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం తాజాగా టర్కీ వెళ్లింది. ఎన్బికె 107 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అక్కడ పలు సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్‌ను పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చింది. దసరా సందర్బంగా ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. 58 కోట్లతో నాన్ థియేట్రికల్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ డీల్ పూర్తి చేయడం బాలయ్య కెరీర్లోనే రికార్డ్ అని అంటున్నారు.