DEVARA: యాక్షన్.. ఎమోషనల్.. పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్..

DEVARA

DEVARA: యాక్షన్.. ఎమోషనల్.. పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్..

DEVARA: నందమూరి అభిమానులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న చిత్రం దేవర. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు కొరటాల ఆచార్య డిజాస్టర్ కావటం తో ఎలాగైనా ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని కృషి చేస్తున్నారు. కొరటాల ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఎంతో ప్రత్యేకం గా ఈ సినిమాను తెరకేస్తున్నారంట.

దేవరలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమెకు ఇదే తెలుగులో తొలి చిత్రం అంటేకాకుండా తాను ఎంతగానో అభిమానిచ్చే జూనివుర్ ఎన్టీఆర్ తో కలసి యాక్ట్ చేయడం పైన ఎంతో ఆశక్తితో ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ గా చేయడం ఈ సినిమాకి ఎంతో హైప్ తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమా పై ఎప్పటికప్పుడు మరిన్ని అంచనాలను పెరిగిపోతున్నాయి.  ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంభందించిన వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్ మరియు సామాజిక మాద్యమాలలో చకర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేశారంట దర్శకుడు. ఇందులో  సాలిడ్ యాక్షన్ తోపాటు.. మంచి ఎమోషనల్ అలాగే.. పవర్ ఫుల్ ఎలివేషన్స్‏కు చాలా ప్రాధాన్యత ఇచ్చారట దర్శకుడు కొరటాల. ముఖ్యంగా ఈ చిత్రంలో తారక్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో  తండ్రి పాత్రలోనూ తారక్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా ఉండే బ్లాక్ గా ఉంటుందని..

దీనిని కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్నారని టాక్ నడుస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తరహాలోనే ఈ మూవీ కూడా సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుందట. కంప్లీట్ గా ఫిక్షనల్ ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లోనే దేవర కథ మొత్తం నడుస్తుందని తెలుస్తోంది. మొత్తానికి విజువల్ ఎఫెక్ట్స్‏తో ప్రేక్షకులకు పుల్ థ్రిల్ కలిగించేందుకు రెడీ అవుతున్నారట కొరటాల. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

ఫుల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో మరో విలన్ గా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఈ సినిమా తర్వాత తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh