BRO MOVIE : పవన్‌ కల్యాణ్ క్రేజ్‌ అలాంటిది మరి:

BRO MOVIE

BRO MOVIE : పవన్‌ కల్యాణ్ క్రేజ్‌ అలాంటిది మరి:

BRO MOVIE: ప్రస్తుతం రెండు  తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రో’ మేనియా నే నడుస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ ఈ సినిమా  జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో స్పీడ్‌ పెంచారు. మంగళవారం బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్‌ కళ్యాణ సినిమా రిలీజ్‌ అవుతుందంటే ఫ్యాన్స్‌కు ఇంక పండగే. పవన్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో ఫీవర్‌ మొదలైంది. ఈ క్రమంలో బ్రో మూవీ రిలీజ్‌ను పురస్కరించుకుని అమెరికాలోని డల్లాస్‌కు చెందిన పవన్‌ కళ్యాణ అభిమానులు ఒక వినూత్న ప్రదర్శన చేపట్టారు. టెస్లా కార్లను ‘బ్రో’ మూవీ టైటిల్‌ ఆకారంలో పార్కింగ్‌ చేసి లైట్‌ షో ప్రదర్శించారు. తరువాత డ్రోన్‌ ద్వారా దీనిని ఘాట్ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఆకాశం నుంచి చూస్తే టెస్లా కార్ల ‘బ్రో’ లైటింగ్‌ షో అద్బుతంగా కనిపిస్తోంది. ఇది చూసి పవన్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులులేకుండా పోతున్నాయి. ఇది కదా సార్ పవర్‌ స్టార్‌ రేంజ్‌ అంటే అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

తమిళ లో హిట్‌ అయిన వినోదయ సీతంకు మూవీకి రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియాంకా వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే  సమకూర్చగా  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మల్టీస్టారర్‌ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు, బీజీఎం ఇప్పటికే సెన్సేషన్‌ కూడా క్రియేట్‌ చేశాయి.

 

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh