సలార్ గంట పాటు అరుపులు కేకలేనా..!

Salaar One Hour High Action Sequences

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదని రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ మీద ఫైర్ అవుతున్నారు. ఈమేరకు సలార్ గురించి ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని మేకర్స్ లీక్స్ రూపం లో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ముఖ్యంగా సలార్ సినిమా యాక్షన్ సీన్స్ పై లేటెస్ట్ టాక్ అదిరిపోయింది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం సలార్ సినిమాలో గంట పాటు ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోరట. అదేంటి అనుకోవచ్చు హై యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ ని అలా ఖుషి చేస్తాయని.. ప్రభాస్ ఎలివేషన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ఉంచేలా చేస్తాయని అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాతో వేరే లెవెల్ కి వెళ్తాడని చెప్పుకుంటున్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరు చొక్కాలు చించుకునేలా ఈ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.

కె.జి.ఎఫ్ తోనే యశ్ లాంటి హీరోకి భారీ ఎలివేషన్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ బాహుబలి లాంటి ప్రభాస్ తో చేసే ఈ సలార్ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుందని అంటున్నారు. సలార్ 1 రికార్డులు కొట్టడం పక్కా అని చెబుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమా చేయలేదు ఈ సినిమా తో అది నెరవేరుతుందని అంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh