సమంత ముఖంలో నవ్వు చూడాలని..!

Vijay Devarakonda Speech at Khushi Musical Concert

విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. అతను అందించిన మ్యూజిక్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేసింది. ఇప్పటికే ఖుషి సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

విజయ్ ఫ్యాన్స్.. సినీ ఆడియన్స్ అంతా కూడా భారీ సంఖ్యలో ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సమంత ముఖం లో నవ్వు కోసమైనా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని అన్నారు. ఈ సినిమా టైం లో సమంత అనారోగ్యపాలైంది. ఆమె కోసమైనా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సమంత ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలని అన్నారు విజయ్. ఇక శివ నిర్వాణ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అన్నారు విజయ్.

నెల రోజుల పాటు ఈ సినిమా కోసం కష్టపడుతున్నాడని అన్నారు. ఇక తన సినిమా నుంచి ఆడియన్స్ హ్యాపీగా బయటకు వచ్చి చాలా రోజులైంది. అయినా కూడా తన మీద ప్రేమని చూపిస్తూనే ఉన్నారు. ఖుషి మీ అందరికీ నచ్చుతుందని సినిమా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు విజయ్. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో భాగంగా విజయ్ సమంత ఇద్దరు కలిసి ఖుషి సాంగ్స్ కి డ్యాన్స్ వేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh