ఎన్టీఆర్ గురించి ఓపెన్ అయిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ ఫేమస్ టెలివిజన్ ప్రోగ్రాం గుడ్ మార్నింగ్ అమెరికా నుంచి చెర్రీకి ఆహ్వానం అందడంతో వెంటనే అక్కడ వాలిపోయారు. ఈ షోలో రామ్ చరణ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. ఈ షోలో భాగంగా తారక్‌తో స్నేహంపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ సెలబ్రిటీల్లో రామ్ చరణ్- ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా సార్లు విన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో సందడి చేస్తూ చెర్రీ చెప్పిన కొన్ని విషయాలు నందమూరి, మెగా అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి మనందరికీ తెలుసు. ఉపాసన గర్భం దాల్చడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదే విషయాన్ని గుడ్ మార్నింగ్ అమెరికా షోలో ప్రస్తావించగా. రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు తారక్ తో తన స్నేహం గురించి రామ్ చరణ్ ఓపెన్ అయ్యారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ప్రకటించక ముందే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నట్లు చెర్రీ చెప్పారు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని, అన్ని విషయాలు షేర్ చేసుకుంటామని అన్నారు రామ్ చరణ్. రాజమౌళి గురించి మాట్లాడుతూ. ఆయన గొప్ప రచయిత రాజమౌళిని ఇండియన్ స్పీల్ బర్గ్ అని పిలుస్తారని. త్వరలో రాజమౌళి తన తదుపరి సినిమాతో గ్లోబల్ సినిమాపై తన సత్తాను చాటనున్నారని తెలిపారు రామ్ చరణ్.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లారు రామ్ చరణ్. అక్కడ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే 6వ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో పాల్గోననున్నారు. ఫిబ్రవరి 24, 2023 సాయంత్రం బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ విల్‌షైర్ హోటల్‌లో జరగనుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై హాలీవుడ్ దిగ్గజాలు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న RRR సినిమా ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ కావడం సంగతి అందరకి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది. అయితే ఈ అవార్డుల ప్రధానం మార్చి 12న జరుగనుంది.
ఇది కూడా చదవండి :