దేవర భైరా.. బాబోయ్ ఇలా ఉన్నాడేంటి..?

NTR Devara Saif Ali Khan Bhaira First Look

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. సినిమాలో తారక్ కి విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలి ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో సైఫ్ పాత్ర పేరు ఏంటి సైఫ్ ఎలా ఉండబోతున్నాడు అన్నది రివీల్ చేస్తూ దేవర నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దేవర లో సైఫ్ లుక్ తో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు అతని పాత్ర పేరు కూడా రివీల్ చేశారు.

ఎన్.టి.ఆర్ దేవర సినిమాలో భైర పాత్రలో సైఫ్ అలి ఖాన్ నటిస్తున్నారు. జులపాల జుట్టుతో భయంకరంగా కనిపిస్తున్నాడు సైఫ్. రీసెంట్ గా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడు పాత్రలో నటించిన సైఫ్ లేటెస్త్ గా దేవర లో కూడా విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ముఖ్యంగా భైరా లుక్ లో అతని లుక్స్ క్రేజీగా ఉన్నాయి. సినిమా మీద అంచనాలు పెంచేలా సైఫ్ భైరా లుక్ ఉందని చెప్పొచ్చు.

యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర సినిమా ఏప్రిల్ 5 2024 న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతాయని తెలుస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh