Jr NTR : ఆస్కార్ మనకు సాకారమయ్యేనా… :
Jr NTR : ప్రపంచ సినీ చరిత్రలో ఆస్కార్ అవార్డ్స్ అన్నది అత్యుత్తమమైనది. ప్రపంచంలోని ప్రతి సినిమా దర్శకుడికి ఆస్కార్ అన్నది ఓ కల. ముఖ్యంగా గడచిన 50 ఏళ్ళ భారతసినీ చరిత్రలో ఆస్కార్ అవార్డ్స్ వరించింది కేవలం పదుల సంఖ్యలో మాత్రమే.
అది కూడా ఉత్తరావనికి సంబంధించిన వారు మాత్రమే ఇప్పటివరకూ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నారు. తెలుగు సినిమాకి ఆస్కార్ అన్నది ఇప్పటివరకూ రాలేదు. కాని 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ లో తెలుగు జయకేతనానికి నాంది పలికించారు ప్రముఖ దర్శకధీరులు రాజమౌళి.
తన ప్రతి సినిమాను శిల్పిలా చెక్కుతూ కెరీర్ లో ఓటమి అన్న పదానికి తావు లేకుండా చేసిన ప్రతి సినిమా ఘన విజయం తో పరిగెడుతున్న రాజమౌళికి అవార్డులకు కొదువ లేదు. కాని ఇప్పుడాయన పరుగులో ఆస్కార్ అన్న మజిలీ వచ్చింద.
ఇటీవల ప్రపంచమంతా ఓ ఊపు ఊపిన RRR చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. తెల్లవాడి గడ్డమీద తెలుగోడి సత్తా చూపే తరుణం ఆసన్నమైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో వుంటుందా లేదా అన్నది అధికారికంగా తేలనుంది.
ఇప్పటి వరకు ఆస్కార్ బరిలో ఏ చిత్రానికి రాని క్రేజ్ RRR సొంతం చేసుకుంది. Jr NTR అటు హాలీవుడ్ మీడియా నే కాక ప్రపంచ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిన ఈ చిత్రం యొక్క పాట “ నాటునాటు “ ఇప్పటికే నామినేషన్స్ లో స్థానం సంపాదించింది.
ఈ సందర్భంగా ప్రజ్ఞ మీడియా ప్రతిష్ఠాత్మకంగా ఓ పోల్ సోషల్ మీడియాలో నిర్వహిస్తుంది. ఆ పోల్ లో మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయం తెలపండి.