తెలంగాణా నూతన సెక్రటేరియట్‌

TS new secretariat complex inauguration

కే సి ఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ  భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కే సి ఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు.    తెలంగాణలో భవిష్యత్‌లో పెరిగే శాసనసభ్యుల సంఖ్య, మంత్రులను దృష్టిలో పెట్టుకొని. గ్రౌండ్‌ ప్లస్‌ ఆరు అంతస్తులతో విశాలమైన కాన్ఫరెన్స్‌ రూమ్స్‌, హాల్స్‌ నిర్మించడం జరిగింది. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 100 ఏళ్లు మనగలిగేలా ఈ సెక్రటేరియట్‌ భవనాన్ని నిర్మించారు.

కాగా సంప్రదాయం, ఆధునికతలకు కలబోతగా ఈ భవనం ఉండనుంది. వాన నీటిని ఒడిసిపట్టేందుకు ఈ భవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా భవనాన్ని అనుకోని ప్రత్యేకంగా ఒక చిన్న రిజర్వాయర్‌ నిర్మించడం జరిగింది.  రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరును ఈ భవనానికి పెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ భవనం ఆరో సీఎం ఛాంబర్‌  అంతస్తులో నైరుతి మూలలో ఉంటుంది.  ముఖ్యమంత్రి జన్మదినమైన ఫిబ్రవరి 17న భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

భారీ విస్తీర్ణంతో నిర్మించినప్పట్టికీ అతి తక్కువ సమయంలోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్‌ 27, 2019న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. జూలై 2020లో పాత భవనాల కూల్చివేత మొదలై శిధిలాల తొలగింపు పనులకే నాలుగు నెలలు పట్టింది. ఏకంగా 14వేల ట్రక్కుల లోడ్ల శిధిలాలు తొలగించారు. జనవరి 4, 2021న నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అంటే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇంత భారీ భవన నిర్మాణం పూర్తైంది.

కాగా ఈ బావనంలో గ్రౌండ్‌ ప్లస్‌ సిక్స్‌ ఫ్లోర్లతో కూడిన ఈ భవనం అద్భుతమైన కట్టడంగా కనువిందు చేస్తోంది. ఈ భవనంలోని ఆరో అంతస్తులో సీఎం ఆఫీసు ఉంటుంది. తూర్పు ముఖంగా ఉన్న భవనంలో నైరుతి మూలన సీఎం ఛాంబర్‌ ఉంటుంది. దీనిపై ఏర్పాటు చేసిన డోమ్స్‌ ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్‌ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు కాగా ఇందులో 10, 51,676 చదరపు అడుగుల్లో భావన నిర్మాణం జరిగింది. ఈ భవనం యక్క ఎత్తు 265 అడుగులు అలాగే భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నం తో కలిపి మొత్తం ఎత్తు 278 కానుంది. దాంతో దేశంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటిగా గుర్తిమ్పబదనుంది. కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh