స్వీటీ అనుష్క నిశ్శబ్ధం సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. లేటెస్ట్ గా అమ్మడు నవీన్ పొలిశెట్టి హీరోగా చేస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించింది. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నవీన్ పొలిశెట్టి పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొనగా అతన్ని ఆట పట్టించేందుకు అనుష్క ప్రాంక్ కాల్ చేసింది. నవీన్ తో తానొక బెంగళూరు అభిమానిగా మాట్లాడిన అనుష్క తన కజిన్ మ్యారేజ్ కి రావాలని కోరింది.
అంతేకాదు మీరు అక్కడ స్టాండప్ కామెడీ కూడా చేయాలని ఆట పట్టించింది. మీకు వనజాక్సి ఇచ్చిన మిక్సీ లాంటిది కాకుండా మేము డబ్బులు ఇస్తామని అన్నది అనుష్క. అప్పుడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే అని అనుష్క ని గుర్తు పట్టాడు నవీన్. అంతేకాదు అనుష్కకి ఇష్టమైన కో యాక్టర్ నవీనే అని అతను చెప్పగా అనుష్క నోటి నుంచి యెస్ అని చెప్పించాలని ప్రయత్నించాడు నవీన్. కానీ మీరు ఏది అంటే అది కరెక్ట్ అని తప్పించుకుంది అనుష్క.
అంతేకాదు అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి ఎంటర్టైనింగ్ తో కూడిన ఎమోషనల్ మూవీ అని ఈ సినిమా తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పింది. అనుష్క నుంచి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కా ఫిడెంట్ గా ఉన్నారు.