గుండె పోటుతో కన్నుమూసిన ప్రముఖ నటుడు

bollywood actor satish kaushik passed awa

Satish Kaushik: గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ వయసు 66ఏళ్లు గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన మృతితో బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆయన హోలీ వేడుకల కోసం దిల్లీలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్లిన గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో డ్రైవర్‌తో కలిసి కారులో ఆస్పత్రికి బయలు దేరిన సతీష్‌ కౌశిక్‌  గారు మార్గమధ్యంలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. ఆయన మరణంతో బీటౌన్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి . అమిత్‌ షా, యోగి ఆదిత్యనాథ్‌, భగవంత్ మాన్‌ వంటి రాజకీయ ప్రముఖులతోపాటు అనుపమ్‌ ఖేర్‌, అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సునీల్‌ శెట్టి, సోనూ సూద్‌, అభిషేక్‌ బచ్చన్‌, కంగనా రనౌత్‌ వంటి సినీ తారలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘రూప్‌ కీ రాణీ చోరోన్‌ కా రాజా’, ‘ప్రేమ్‌’, ‘తేరే నామ్‌’, ‘షాదీ సే పెహ్లే’ వంటి చిత్రాలకు సతీశ్‌ దర్శకత్వం వహించారు. ‘ఉత్సవ్‌’, ‘సాగర్‌’, ‘మిస్టర్‌ ఇండియా’, ‘రాజాజీ’, ‘భాఘి 3’ వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటుడిగానూ మెప్పించారు. ప్రస్తుతం ఆయన ‘ఎమెర్జన్సీ’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపద్యంలోనే హోలీ వేడుకల కోసం వృత్తిపరమైన జీవితం నుంచి కాస్త బ్రేక్‌ తీసుకుని దిల్లీకి వెళ్లిన ఆయన తన స్నేహితుడు జావేద్‌ అక్తర్‌ కుటుంబంతో కలిసి సందడిగా గడిపారు. ఆ ఫొటోలను సైతం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం ఆయన ఆత్మీయులను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.

కాగా.. ప్రియ స్నేహితుడు సతీష్ మరణం పట్ల నటుడు అనుపమ్ ఖేర్ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘ఈ ప్రపంచంలోని అంతిమ సత్యం మరణమే అని నాకు తెలుసు. కానీ నేను బతికుండగా.. నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కౌశిక్ గురించి ఇలా రాస్తానని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల స్నేహానికి ఇంత సడన్‌గా ఫుల్ స్టాప్ పడుతుందనుకోలేదు!! నువ్వు లేకుండా ఈ జీవితం మునుపటిలా ఉండదు సతీష్! ఓం శాంతి!’ అని పోస్టులో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD), ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో పూర్వ విద్యార్థి. అనుపమ్ ఖేర్ NSDలో అతని బ్యాచ్‌మేట్.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh