ఆర్‌ఆర్‌ఆర్‌ పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్

Tammareddy Bharadwaja comments on RRR Budget

RRR- Oscar: ఆర్‌ఆర్‌ఆర్‌ పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నామినేషన్‌లో ఉన్నప్పటి నుంచి ఈ చిత్రంపై మరింత క్రేజ్‌ పెరిగిపోయింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌ వస్తే తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా యావత్‌ దేశం గర్విస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాడు. సగటు సినీ అభిమాని కోరుకునేది అదే! దీని కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతగానో కృషి చేస్తోంది. విదేశాల్లో భారీగా ప్రమోషన్‌ చేస్తోంది. అయితే సీనియర్‌ దర్శకనిర్మాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ్మారెడ్డి భరద్వాజ గారు తాజాగా రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ – ఆస్కార్‌’ విషయమై విమర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది.   రానురాను సినిమా మేకింగ్‌ అనేది ఎలా మారిందనే విషయమై ఆయన మాట్లాడారు. సినిమా బడ్జెట్‌ అనేది దర్శకుడు నిర్ణయించడం కరెక్ట్‌ కాదు. దర్శకుడు కథ రెడీ చేస్తే దానికి బడ్జెట్‌ 20 కోట్లా, 30 కోట్లా అన్నది నిర్మాత డిసైడ్‌ చేస్తాడు. ఇప్పుడున్న దర్శకులు కథకే 14 కోట్లు బడ్జెట్‌ అంటున్నారు. ఆ కథతో సినిమా తీయాలంటే ఇంకెంత ఖర్చు అవుతుంది అన్నది దిగితే కానీ తెలీదు మరి ‘బాహుబలి’ సినిమాకు రాజమౌళి రూ.200కోట్లకు పైగా బడ్జెట్‌ పెట్టాడు. అప్పట్లో తెలుగు సినిమాకు అది చాలా ఎక్కువ  మరీ సినిమా పిచ్చి ఉన్నవాళ్లే ఆ ధైర్యం చేస్తారు. రాజమౌళి సక్సెస్‌ఫుల్‌ సినిమా తీసి నిరూపించాడు.

అప్పుడు నా ఆలోచన తప్పు అనుకున్నా కానీ నా మాట తప్పని ఇప్పటికీ ఒప్పుకోను కాకపోతే హిట్‌ సినిమా తీశారు కాబట్టి అంగీకరించాల్సి వచ్చింది. దర్శకుడు కథ రెడీ చేసుకుని మంచి నిర్మాతను పట్టుకుంటే కావల్సిన బడ్జెట్‌తో సినిమా తీస్తాడు అంతే కానీ దర్శకుడే బడ్జెట్‌ని నిర్ణయించడం కరెక్ట్‌ కాదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు రూ.600 కోట్ల బడ్జెట్‌ పెట్టారు. మంచి సినిమా తీశారు. ‘ఆస్కార్‌’ ప్రమోషన్స్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు మాలాంటి వాళ్లకు ఇస్తే 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. ప్రస్తుతం మనం తీసే చిత్రాలు మన సంతృప్తి కోసమే తప్ప సమాజం కోసం కాదు.

మేకర్స్‌గా సమాజానికి మంచి చెప్పే అవకాశం మనకు ఉంది కాబట్టి అప్పుడప్పుడూ సమాజానికి ఉపయోగపడే చిత్రాలు కూడా తీయాలి’’ అని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట తెగ చక్కెరలు కొడుతున్నాయి. కొందరు తమ్మారెడ్డి భరద్వాజకు మద్దతుగా నిలిస్తే మరికొందరు  కొందరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh