కవితకు ఈడీ సమన్లపై తొలిసారి స్పందించిన కేటీఆర్‌

Telangana Minister Ktr Sensational Allegations on PM Modi Over

Telangana: కవితకు ఈడీ సమన్లపై తొలిసారి స్పందించిన కేటీఆర్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా భాగం ఉన్నట్టు గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన బీజేపి నేతలు పర్వేష్ వర్మ, మజిందర్ సింగ్ చేసిన ఆరోపణలతో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి ముడిపెడుతూ కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటికొచ్చింది. అయితే కవితకు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోది  బీజేపీ ప్రభుత్వ విధానాలపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్‌లో 11 మంది నేతలపై దాడులు చేశారని అన్నారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోదీ సమన్లు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలపై కేసుల దాడి జనాలపై ధరల దాడి చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం అని ఆయన ద్వజమెత్తరు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్. ముంద్రా పోర్టులో రూ. 21వేల కోట్ల డ్రగ్స్‌ దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. బీజేపీలో ఎవరు చేరినా కేసులు ఉండవని విమర్శించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితోనే అదానీకి ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందని, దానిపై చర్యలేవని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ వస్తాయని, మీడియాను సైతం వదలరని విమర్శించారు మంత్రి. అదానీతో ఒప్పందం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్‌ అన్నట్లే అని శ్రీలంక ప్రతినిథి చెప్పడాని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు మంత్రి కేటీఆర్. ఆ అభియోగాలపై కేసులు ఉండవు, ప్రధాని వివరణ ఇవ్వరని విమర్శించారు. 2014 తర్వాత 95శాతం ఈడీ దాడులు విపక్షాలపైనే జరిగాయని, భారీ అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్ చెప్పిన స్కామ్స్ ఏంటంటే గుజరాత్‌లో నిషేధం ఉన్నా లిక్కర్ తాగి 21మంది చనిపోవడం పెద్ద స్కామ్. ఇంకా  అదానీ నుంచే బొగ్గు కొనాలని పాలసీ చెయ్యడం మరోస్కామ్. అలాగే రెండు ఎయిర్‌పోర్ట్‌ల నిబంధన కాదని ఆరుఎయిర్‌పోర్టులు ఆదానికి ఇవ్వడం స్కామ్. మరియు అదానీ పోర్టుల్లో డ్రగ్స్ దొరికినా విచారణ లేకపోవడం పెద్ద స్కామ్. ఇంకా కృష్ణపట్నం, గంగవరం, ముంబై ఎయిర్‌పోర్ట్‌లు బెదిరించి లాక్కోవడం పెద్ద స్కామ్.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh