DJ TILLU2: ఆకట్టుకుంటున్న టిల్లు 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో

DJ Tillu 2

DJ TILLU2: ఆకట్టుకుంటున్న టిల్లు 2 ఫస్ట్ సాంగ్ ప్రోమో

DJ TILLU2: ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని విజయం సాధించిన సినిమాల్లో డీజే టిల్లు సినిమా కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి కథను సిద్దు జొన్నల గడ్డనే రచించారు. మంచి టాక్ తో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని తెరకేకిస్తున్నారు. టిల్లు 2 అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ హీరోయిన్ చేంజ్ చేశారు. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ మూవీ నుంచి గ్లింమ్స్ ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఆ గ్లింమ్స్ సినిమా పై మంచి బజ్ని క్రియేట్ చేసింది.

ఇక ఇప్పుడు డిజే తిల్లు నుంచి సాంగ్ ప్రోమోను రిలీస్ చేశారు. ఈ పాటకు ముందు వచ్చే చిన్న సన్నివేశాన్ని కూడ రిలీజ్ చేశారు. ఆ  వీడియోలో అనుపమాను సిద్దూ జొన్నలగడ్డ ఫ్లటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో చివరిలో “పోయిన సారి అంత అయినా కూడా సిగ్గురాలేదు టిల్లు అన్నకి” అని మార్కస్ అనే డైలాగ్ వస్తుంది.

టికెట్టే కొనకుండా అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాల పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిగా  ఈ పాటను జులై 26న విడుదల చేయబోతున్నారు. ఇంక ఈ సినిమాకు  మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా  రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

మరిన్ని కథానల కోసం వీక్షించండి ప్రజ్ఞ మీడియా 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh