Nani : ‘బలగం’పై నాని ప్రశంసల జల్లు

Nani

Nani : ‘బలగం’పై నాని ప్రశంసల జల్లు

కమెడియన్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బలగం’ ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే.

ప్రతి ఒక్కరిలోని భావోద్వేగాలను తట్టిలేపిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానే కాదు..

అవార్డుల్లోనూ రికార్డు సాధించింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి ప్రముఖులు సైతం బలగం ను మెచ్చుకున్నారు.

అంతర్జాతీయంగా అవార్డులు క్యూ కట్టాయి. వీటన్నిటికీ మించి తెలంగాణలోని చాలా పల్లెల్లో పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలు

ఏర్పాటుచేసుకుని మరీ బలగం ను వీక్షించడం ఈ మూవీకున్న ప్రత్యేకతకు నిదర్శనం.

అలాగే ఈ సినిమా  ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.  మరొక వైపు విమర్శకుల ప్రశంసలు అందుకున్న

ఈ చిత్రంపై తాజాగా  హీరో Nani  తాజాగా పొగడ్తల వర్షం కురిపించారు.

ఇంత మంచి సినిమాను తాను ఇన్ని రోజులు చూడలేదంటే ఆశ్చర్యంగా ఉందన్నారు.’

నేను ఇంత ఆలస్యంగా బలగం మూవీని చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.

ఇది కదా తెలుగు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. వేణు, దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ సహా

ఈ ప్రెస్టేజియస్‌ మూవీకి పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. మీరందరూ లో నటించలేదు జీవించేశారు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం Nani పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇంత మంచి ను ఇంత లేటుగా చూశావేంటి బ్రో’ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కానీ అభిమానులంతా ఆయన తర్వాత సినిమా వివరాలు చెప్పమని కోరుతున్నారు. కనీసం టైటిల్‌ అయినా ప్రకటించాలని కామెంట్స్‌ పెడుతున్నారు.

ప్రస్తుతం Nani  తన 30వ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో సౌరవ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

తండ్రీ కూతుళ్ల బంధం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో నానికి జోడీగా ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు.

దీని తర్వాత నాని మరోసారి వివేక్‌ ఆత్రేయతో సినిమా చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh