టాలీవుడ్ స్టార్ హీరో తో జోడి కట్టనున్న గ్లోబల్ బ్యూటీ

టాలీవుడ్ స్టార్ హీరో తో జోడి కట్టనున్న  గ్లోబల్ బ్యూటీ

బాలీవుడ్ లో గోబర్ బ్యూటీ అంటే టక్కున చెప్పే పేర్లలో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది ఆమె ఎవరు అనుకుంటున్నా ర స్టార్ హీరోయిన్ ప్రియక చోప్రా.ఈమె  హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ భామ. అంతే కాదు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడ అందుకుంటుంది ప్రియాంక. ఈ అమ్మడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోవాలి. ఎంటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి  ఎన్నో  అవాంతరాలు ఎదుర్కొని హీరోయిన్ గా నిలబడింది. ఇక  హిందీ సినిమాలతతోనే కాదు ఏకంగా హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి సత్తా చాటింది. ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్ళాడి వార్తల్లోనూ నిలిచింది ఈ  భామ తనకంటే 10 ఏళ్ళు చిన్న వాడైనా నిక్ ను వివాహం చేసుకుంది . అప్పట్లో వీరి వివాహం ఒక హాట్ టాపిక్. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇటీవలే వీరికి బిడ్డకూడా జన్మించింది .

బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి సమయం పాపాయితోనే గడిపేస్తోంది ప్రియాంక. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తన కూతురి ఫోటోను రీసెంట్ గా రివీల్ చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. ప్రియాంకా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల ఇండియా కు తిరిగి వచ్చింది కూడా ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఒక వార్త తెగ హలచల్ చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్ ఒక సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, కియారా అద్వానీ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పీసీ కూడా ఇప్పుడు ఈ భారీ మల్టీ స్టారర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావాలని చూస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన జంజీర్ తెలుగులో తుఫాన్ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో నటించింది ప్రియాంక మళ్ళి  ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh