బిగ్ బాస్ 7 ఈసారి నెక్స్ట్ లెవెల్ అంతే..!

BiggBoss Season 7 Next Level Planning

ఆరు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ త్వరలో 7వ సీజన్ కు రెడీ అవుతుంది. ఈసారి హోస్ట్ మారుతున్నాడు.. నాగార్జున కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తాడని వార్తలు వచ్చినా అది పెద్ద గాసిప్పే అని తేలింది. రీసెంట్ గానే నాగార్జున ప్రోమో రిలీజైంది. అయితే ఈసారి ఆసక్తికరంగా ప్రోమో నుంచే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇదివరకులా కాదు కుడి ఎడమైతే అంటూ నాగార్జున ఇప్పటికే సీజన్ పై అంచనాలు పెంచేస్తున్నారు.

ఇక బిగ్ బాస్ టీం కూడా ఇదివరకు సీజన్ లలో జరిగిన తప్పులని సరి చేసుకుని ఈ సీజన్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని చూస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఇంతవరకు తెలుగు బిగ్ బాస్ లో లేనటువంటి టాస్క్ లు.. పనిష్ మెంట్ లను ప్లాన్ చేస్తున్నారట. హౌజ్ లోకి వచ్చే కంటెస్టంట్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా ఈ సీజన్ సర్ ప్రైజ్ అనిపిస్తుందని అంటున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ సెకండ్ వీక్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సీజన్ కంటెస్టంట్స్ విషయంలో కూడా బిగ్ బాస్ టీం చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్లని తీసుకొచ్చే ఆలోచన మానుకొని క్రేజీ కంటెస్టంట్స్ తో ఈ సీజన్ నడిపిస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెబుతున్నారు బిగ్ బాస్ టీం. స్టార్ మా కూడా ఈసారి సీజన్ కి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh