అదిదా సార్ రజిని మాస్ మేనియా.. ఫ్యూజులు ఔట్ అయ్యే బుకింగ్స్..!

Superstar Rajinikanth Jailer Record Advance Bookings in Benguluru

సూపర్ స్టార్ రజినికాంత్ మాస్ మేనియా గురించి ఆయన కలెక్షన్స్ స్టామినా గురించి అందరికీ తెలిసిందే. రజిని సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం రికార్డులు సృష్టిస్తాయి. కేవలం కోలీవుడ్ లోనే కాదు రజిని సినిమా అంటే సౌత్ మొత్తం షేక్ అవ్వాల్సిందే. ఒకానొక దశలో రజిని సినిమాలు తెలుగు స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీ ఇచ్చాయి. అయితే ఈమధ్య కాలంలో రజిని బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు అందుకోలేదు.

కబాలి కాస్త హడావిడి చేసినా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా రజిని రేంజ్ హిట్ అందుకోలేదు. కొన్ని సినిమాలు అయితే దారుణమైన ఫలితాలతో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాలు మిగిల్చాయి. ఇదిలాఉంటే సూపర్ స్టార్ రజిని లేటెస్ట్ మూవీ జైలర్ మాత్రం ఒక రేంజ్ లో హడావిడి చేస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ జైలర్ సినిమా గురువారం రిలీజ్ అవుతుంది. ఆగష్టు 11న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ వస్తుండగా ఒకరోజు ముంది జైలర్ సందడి చేయబోతున్నాడు.

జైలర్ సినిమా తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసింది. ఇక జైలర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా బెంగుళూరులో బుకింగ్స్ అదిరిపోయినట్టు తెలుస్తుంది. టికెట్స్ ఇలా పెట్టడమే ఆలస్యం అలా హాట్ కేకుల్లా అయిపోతున్నాయట. రజిని సినిమా బెంగుళూరులో కూడా రికార్డులు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సూపర్ స్టార్ రజినికాంత్ స్టామినా చూపించేలా బెంగుళూరులో ఓపెనింగ్స్ ఉంటాయని తెలుస్తుంది. కర్ణాటకలో రజినికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏంటి అన్నది జైలర్ బుకింగ్స్ చూస్తే అర్ధమవుతుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh