తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకున్న జాన్వీ

sridevi daughter janvi

తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకున్న జాన్వీ

జాన్వీఎన్టీఆర్ 30 టీమ్ నిర్వహించిన ఓ ఫోటోషూట్‌లో ఆమె పాల్గోని వెళ్లినట్లు సమాచారం. అలాగే ఈ సినిమా ఫిబ్రవరి 20న లాంఛనంగా ప్రారంభంకానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ తాజాగా హైదరాబాద్‌కు వచ్చిందట. ఇక ఆమె శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో ఫ్యాన్స్‌తో దిగిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 24న ఫాల్గుణ శుద్ద పంచమి మంచి రోజు కావడంతో ఆ రోజు పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ ముహూర్తానికి కళ్యాణ్ రామ్, త్రివిక్రమ్, రాజమౌళి, హరీష్ శంకర్, ప్రశాంత్ నీల్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం. ఇక మార్చి 20 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శివారులో వేసిన సెట్లో మొదలు కానుందని తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం లో జాన్వీ హీరోయిన్‌గా ఖరారు అవ్వడంతో ఆమె మిగతా ప్రోజెక్టుల కంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసమే డేట్స్ కూడా ఎక్కువ కేటాయించింది అని సమాచారం. ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలై మార్చి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది. 2024, ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. యువసుధ ఆర్ట్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఇటీవలే మిలీ అనే రీమేక్ చిత్రంలో నటించిన జాన్వీ తన తల్లి దివంగత నటి శ్రీదేవి అడుగుజాడల్లో నడుస్తూ నటనతో అందచందాల విషయంలో కూడా అదరగొడుతోంది. ఇక జాన్వీ నటించిన మరో లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలై ఓకే అనిపించుకుంది. జాన్వీకి సౌత్ భాషాల్లో నటించాలనీ ఉందట. తన లేటెస్ట్ సినిమా మిలి ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ. సౌత్ భాషల్లో నటించాలనీ ఉందని తెలిపింది.

జాన్వీ తాజాగా  సోషల్ మీడియాలో తన బోల్డ్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడం వెనుక కారణం ఉందని. తాను సోషల్ మీడియాను అంత సీరియస్‌గా తీసుకోలేదని. అయితే అక్కడ కాస్తా బోల్డ్‌గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని. ఇంకో 5 మంది తన ఫోటోలను లైక్ చేస్తారని, దీంతో తనకు ఉన్న ఈఎంఐలు కట్టడం కాస్తా సులువు అవుతుందని. అందుకే అలా చేసున్నానని తెలిపింది జాన్వీ ఆదాయం 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్‌ వరకు ఉంటుందని తెలుస్తోంది.

అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లుగా ఉండనుంది. ఇక జాన్వీ నెలవారీ ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం 6 నుంచి 8 కోట్లకు ఉంటుందని అంటున్నారు. ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలి మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు బోనీకపూర్ నిర్మాత, ఇక మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు సమాచారాం.  తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో వేచి చూడాలి మరి.

ఇక జాన్వీ ఈ మధ్య కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గోన్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు దూమరానికి దారితీయడంతో సారీ చెప్పింది. వివరాల్లోకి వెళితే ఈ భామ హిందీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై వ్యంగ్యంతో కూడిన కొన్ని కామెంట్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్‌మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారీ చెప్పింది ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో జాన్వీ ఓ ప్రశ్నకు సమాధానంగా సోదరుడు అర్జున్‌కపూర్‌తో ఓ సినిమా తీస్తానని, దానికి ‘నెపోటిజమ్‌’ అనే పేరు పెడతానంటూ ఓ కామెంట్ చేసింది. జాన్వీ సరదాగా చేసిన కామెంట్‌పై నెటిజన్స్ తీవ్రంగా రియాక్ట్ అవ్వుతున్నారు. జాన్వీ మాటలు పరోక్షంగా నెపోటిజంను ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి దీంతో జాన్వీకపూర్‌ చివరకు సారీ చెప్పి వివాదానికి ముగింపు పలికింది. ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ లక్ జెర్రీ ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీకపూర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటనతో తల్లికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh