టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ డేట్ పిక్స్
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకీ రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయిన ఇంకా అనుచరులతో సమావేశం తర్వాత నిర్ణయాన్ని ప్రకటించారు అయితే కన్నా ఏ పార్టీలో చేరతారనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలైంది. పార్టీకి రాజీనామా ప్రకటించిన కొద్దిసేపటికే. కన్నా ఈ నెల 24న టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కన్నా గురించి మరో రూమర్ కూడా మొదలైంది. కన్నా పది రోజుల క్రితం టీడీపీ పెద్దలతో హైదరాబాద్‌లో సమావేశం అయ్యారని.స్వయంగా అధినేతే టీడీపీలోకి ఆహ్వానించడంతో ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల్లో కన్నా అధికారికంగా టీడీపీలో చేరికపై ప్రకటన చేస్తారని అంటున్నారు.
కన్నా మాత్రం తన భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారు. కన్నా టీడీపీలో చేరితే ఎక్కడ సీట్ ఇస్తారనే చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని కొంతమంది ట్వీట్‌లు చేయగా. అలాగే గుంటూరు వెస్ట్ నుంచి బరిలో ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఆయన మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కొద్దిరోజుల క్రితం లక్ష్మీనారాయణ జనసేన పార్టీలోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో తెలుగు దేశం పార్టీలో చేరతారని అంటున్నారు. కన్నా బీజేపీకి రాజీనామా చేయడం ఖాయమని చాలా రోజుల క్రితమే ప్రచారం జరిగింది. రాష్ట్ర అధినాయకత్వం తీరుపై లక్ష్మీనాారాయణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పార్టీలో పరిస్థితి మారిపోయిందని. ఆయన పార్టీని సొంత సంస్థలా నడుపుతున్నారని విమర్శించారు. తాను పార్టీలో ఇమడలేకపోయానని. అందుకే రాజీనామా చేశానన్నారు అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరినా పట్టించుకోలేదన్నారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్టీలో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు పార్టీని నడిపే తీరు సరిగా లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన పరిణామాలు తనను బాధించాయన్నారు. ఓవర్ నైట్ నేత కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేశారు. 2014లో మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీలోకి వచ్చానని. తనకు పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: