మెగాస్టార్ పరువు తీస్తున్న భోళా కలెక్షన్స్.. మరీ లక్షలు ఏంటి బాసు..!

Megastar Chiranjeevi Distaster Collections Bhola Shankar

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. తమిళ సినిమా వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది. మొదటి షో నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ వరకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ వల్ల సోసోగా వసూళ్లను రాబట్టినా మండే రోజు అసలు మ్యాటర్ అర్ధమైంది. భోళా శంకర్ సినిమాకు సోమవారం రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో కేవం 20 నుంచి 25 లక్షలు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏంటి ఈ లక్షల్లో వసూళ్లు ఏంటని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చిరంజీవి స్టామినా ఏంటి భోళా శంకర్ కి వస్తున్న ఈ కలెక్షన్స్ ఏంటని మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. చిరు కెరీర్ లో ఎన్నో డిజాస్టర్ లు ఉన్నాయి వాటిని దాటి మొదటి ప్లేస్ లో ఉండేందుకు భోళా శంకర్ ప్రయత్నిస్తుంది. దశాబ్ధ కాలం తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళా శంకర్ ఈ విధమైన రిజల్ట్ అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా డైరెక్టర్ పై మండిపడుతున్నారు.

అంతేకాదు చిరుకి మెగా ఫ్యాన్స్ నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ కూడా వచ్చింది. ఇక మీదట అసలు రీమేక్ ల జోలికి వెళ్లొద్దని చేస్తే ఒరిజినల్ కథ చేయండని ఫ్యాన్స్ కోరుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా లూసిఫర్ రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ కూడా నిరాశపరచింది. ఇప్పుడు భోళా శంకర్ రిజల్ట్ కూడా షాక్ ఇచ్చింది. మరి మెగా బాస్ ఈ రీమేక్ ల జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్ అని ఈ ఫలితాలు చూసి చెప్పొచ్చు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh