3 డేస్ 300 కోట్లు.. ఇది రజని స్టామినా..!

Rajinikanth Jailer 300 Crores Collections

సూపర్ స్టార్ రజిని బాక్సాఫీస్ పై తన స్టామినా చూపిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజినికాంత్ ఆ సినిమాతో మరోసారి తన పూర్వ వైభవాన్ని చూపిస్తున్నారు. ఈమధ్య కాలం లో రజిని సినిమాలేవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అందుకే రజిని సినిమాలకు ఉండాల్సిన బాక్సాఫీస్ కలెక్షన్స్ లేకుండా పోయాయి.

అయితే జైలర్ సినిమాతో రజిని తన ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. రిలీజైన మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న జైలర్ సినిమా రోజు రోజుకి వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి. ఫస్ట్ డే 90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన రజిని జైలర్ వీకెండ్ లో 300 కోట్ల గ్రాస్ తో దుమ్ము దులిపేస్తుంది. రజిని సినిమా హిట్ పడితే వసూళ్ల లెక్కలు ఎలా ఉంటాయో జైలర్ సినిమా కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది.

రజిని జైలర్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించారు. జైలర్ సినిమా తెలుగులో ముందు బిజినెస్ విషయంలో కన్ ఫ్యూజ్ ఏర్పడినా సినిమా రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. 300 కోట్లతో ఈ ఏజ్ లో కూడా బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు రజిని.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh